Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

ప్రేమించకుండా ఉండటం సాద్యమైతదా....?

ఈ వయస్సు పిల్లలకు కులం అంటే తెలియదు, తెలిసినా వారి కులం ఎట్ల అంటారనిదైందో తెలువదు...!

వారికి ప్రేమించడమే తెలుసు...!
మీకులం తక్కువని మా అమ్మాయి జోలికి వస్తే చంపేస్తామని హెచ్చరించడం,తీవ్రంగా కొట్టడం, హింసించడం నేడు సహజమైన సంఘటనలుగా మనం చూస్తున్నాం...!

మరి ఈ సమస్య కు పరిష్కారం ఏమిటీ...?

అంటే ప్రేమించకుండా ఉండటమే...!

మరి ప్రేమించకుండా ఉండటం సాద్యమైతదా....?

సరే కులం తక్కువ పేరుతో చంపుతున్నారంటే ఏదో అనుకుందాం...!

ఒకే కులం వారు, ఒకే మతం వారు ప్రేమించుకున్నా చంపుతున్నారు దిన్నేలా అర్థం చేసుకోవాలో తెలియని స్థితిలో యువత ఉంది...!

మరి ఇలాంటి ప్రేమ హత్యలు కుల, మతపరమైన చావులు ఎలా అగుతాయో ఆలోచన చేయండి...!

ఈ దేశంలో ప్రేమిస్తే చంపేస్తారు....! యువతరమా ఆలోచన చేయండి, లేకపోతే మీ ప్రేమలు ఈ దేశంలో చంపబడటం ఖాయం....!
బండి మొగిలి,
న్యాయవాది,
9989602566.

Comments