Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

మీరెప్పటికి మాకు నేతలు కారు...! కాబోరు....!

  అంబేద్కర్ తన జీవితాన్ని, త్యాగం చేసి,తన పిల్లలను చంపుకొని సమాజంలోని పిల్లలంతా తన పిల్లలుగా భావించాలని తన భార్య రమాబాయికి ఓదార్పు నిచ్చింది...ఇందుకేనా....? మంత్రులం,ఎమ్మేల్యే,ఎంపీలం,దేశ,రాష్ట్ర,జిల్లా, నియోకవర్గ,మండల,గ్రామ, నాయకులమని విర్రవీగే వెదవల్లారా...? మీరెవరికి నేతలు...? మాకా ..! కారు.....!          మీరెప్పటికి మాకు నేతలు కారు...! కాబోరు....!        మీలాంటి దగుల్బాజీ నేతల వల్ల నిజాయితీ కల్గిన బహుజన, మెజార్టీ సమాజం అనేక ఆటుపోట్లు,అవమానాలు,ఎదుర్కొంటున్నారు..!                నీరక్త సమాజమేకాక నీలాగే అంటరాని తనం అనుభవింస్తున్నా సోదరా కులాలు, మీకు రిజ్వేషన్ల ఇంకా ఎన్నాళ్ళు...ఎన్నేళ్ళు.... అని తమను ప్రశింస్తున్నారు...?      దీనికి మీ సమాధానం ఏమిటి...?           ఎవరు చెప్పాలి...?            సమాజానికి ఆన్సర్ చెప్పే బాధ్యత మీది కాదా ..? అంబేద్కర్ మా దేవుడని జబ్బలు చర్చుకునే మీరు ఆయన అనుసరించిన విధానాలను,ఎందుకు అనుసరించరు....!         జ్ఞానంతో నడిచి నీ సోదరా సమాజాన్ని అజ్ఞానం నుండి విముక్తి కోసం కృషి సల్పకుండా అగ్రవర్ణ సమాజంతో అంటకాగుతూ బ్రతుకుతున్నా బ్రతుకు బ్రతుకేనా...? ఆలోచించు, నీకు కావాల్సింది అధికారమే కదా...! అధికారం విలువలతో కూడిన దాన్ని నువ్వు అనుభవిస్తూ నీ సమాజాన్ని నడిపించు...అది నీ బాధ్యత...!               కాదంటారా ...?

                                                      మీ,

                                                బండి మొగిలి,

                                                 న్యాయవాది,

                                               9989602566.

Comments