Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

అమ్మ పై అత్యాచారం చేసే వారు సత్పరివర్తన కల్గిన వరా....?

 

నవ తరంగాలు

అమ్మ పై అత్యాచారం చేసి అరుస్తున్న పాపను నేలకేసి కొట్టి చంపిన ఉన్మాదులు సత్పరివర్తన కలిగిన వరా...? 

 అత్యాచారం చేసి పసిపిల్లలను, కుటుంబ సభ్యులను, ఒకవైపు గొడ్డళ్లు, గడ్డపారతో నరికి చంపిన కిరాతక హంతకులను సత్ప్రవర్తన కలిగిన వారని  కేంద్ర ప్రభుత్వం నేరస్తులకు విముక్తి కల్గించారంటే దేశాన్ని పాలిస్తున్న వారి మానసిక స్థితిని ప్రజలు అర్థం చేసుకొని, ప్రజలన్నా మారాలి...? లేక ప్రభుత్వాన్ని అన్నా మార్చాలి...? 

  ఆడవాళ్ళను గౌరించే గొప్పదేశంగా చెప్పుకునే మనం ఆడవాళ్ళను చేరిచి, వారి శరీరంలోని అన్ని భాగాలను విరిచి, సహాయం చేయబోయిన అధికారులను, అడ్వకెట్లను,   చంపిన  వారు మన ప్రభుత్వాలకు మానవత్వం ఉన్న వారిలా కనపడుతున్నారంటే ఈదేశాన్ని ఏలుతున్నా ప్రభువుల మనస్సు ఎంత గొప్పదో ప్రజలే అర్థం చేసుకోవాలి...!

  దేశంలో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లఘన జరుగుతున్నదని మానవ హక్కుల పర్యవేక్షక సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొన్నదంటే మనదేశ పాలకులు ఎంత గొప్ప వారో.....? ఆలోచించండి...!

   దేశంలో ప్రస్తుతం ఉన్నా పరిస్థితుల వల్ల ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్  సంస్థ ప్రతనిధులు కొన్ని రాష్ట్రాల్లో సందర్శించ లేక పోయామని చెప్పిందంటే దేశంలో బాధితుల పరిస్థితి అర్థం చేసుకోవాలి...! 

  ఇక జమ్మూకాశ్మీర్ లో అధికార దుర్విినీయోగం జరుగుతున్నదని తేల్చి చెప్పుతూ ఇప్పటి వరకు 585 మంది పౌరులు అపహరణకు గురైనారని, వారి అచికి కోసం కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్స్ దాఖలు కాగా కేవలం 14 మంది మాత్రమే దొరికారు ఇంకా 560 మంది అడ్రస్ గల్లంతయ్యింరంటే దేశంలో పరిస్థితి  ఎలా ఉందో.....? అర్థం చేసుకోవాలి....!

    ప్రజలారా ఈ దేశ మనుధర్మ పాలకుల వల్ల దేశ ప్రజలు, ప్రజాస్వామ్యం, నాశనమైయ్యే పరిస్థుతులు ఉన్నాయి...! ఆలోచన చెయ్యాలని కోరుతూ.....!

                                                      మీ,

                                                బండి మొగిలి,

                                                 న్యాయవాది,

                                               9989602566.



Comments