Search This Blog
Nava Tarangalu (translated as “New Waves”) is a widely circulated Telugu-language daily newspaper published in the Indian state of Telangana District Warangal, Hanamkonda Owned by BANOTH VIJAYKUMAR. Launched on 2021, the publication serves as a voice for regional and public issues.
త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు
- Get link
- X
- Other Apps
అదానీ గ్రూప్ చేస్తున్న వ్యాపారం వల్ల దేశంలోని పేదలకు ఏమైనా ఉపయోగం ఉందా ..!
![]() |
| నవ తరంగాలు |
ప్రపంచంలోనే దేశాన్ని టాప్ లోకి తేవడం కోసం కృషిని గంగలో, తుంగలో తొక్కిన పాలకులు....!
దోపిడీలో మాత్రం టాప్ 3లో చోటు సంపాదించిన ఆదానీ నీ మాత్రం మన పాలకులు కొనియాడుతున్నారు...!
ఒక్క ఏడాదికలోనే నాలుగు లక్షల కోట్లు సంపాదించాడాంటే ఈయన పని వ్యాపారమా...? లేక దొంగ తనమా.....?
దేశ ప్రజలు ఆలోచన చేయాలి...!
అదానీ గ్రూప్ చేస్తున్న వ్యాపారం వల్ల దేశంలోని పేదలకు ఏమైనా ఉపయోగం ఉందా ..!
లేదు కదా...!
అలాంటప్పుడు పేదప్రజల రక్తాన్ని చేమటగా చేసి ప్రభుత్వానికి కట్టిన పన్నుల నుండి ఆధానీ, అంబానీ, తదితర వ్యాపారవేత్తలకు సబ్సిడీలు, పన్ను రాయితీలు ప్రభుత్వాలు ఎందుకిస్తున్నట్లు ప్రజలు ఆలోచన చేయాలి...!
వీరి వ్యాపారాల వల్ల పాలకులకు ఖరీదైన ఇండ్లు, కార్లు, భూములు, ఇంకా ఎన్నో లక్షల కోట్లు రూపాయలు సమకూరుస్తున్నయి.
ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఇన్ని కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమిచేస్తున్నరో ఓటర్లకు తెలియదా...?
మరి ఎందుకు ఈపార్టీలనే అధికారంలో కి తెస్తున్నారు, పైగా ఓటరు మాకేమన్న ఉత్తగా ఓట్లు వేస్తున్నారా...? మేము ఓటుకు వెయ్యి, ఐదొందలు బీరు, బిర్యానీలు ఇచ్చి ఓట్లను కొంటున్నాము అంటున్నారు...!
పైగా ఓటరే మారాలి అప్పటి వరకు ఈ సిస్టం మారదంటున్నరు...!
మరి ఏమిచేద్దాము...?
మారుదమా...?
లేక బీరు బిర్యానీ డబ్బులకు అమ్ముడు పోదామా...?
వారైతే ఎలాగూ మారరు...!
ఎందుకంటే అధికారాన్ని అనుభవిస్తున్న పార్టీల రక్తంలోనే మోసం చేసే డి, ఎన్, ఏ, ఉంది...!
కాబట్టి మారాల్సింది మనమే...!
బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది, ఓటు హక్కు ఇచ్చింది...! మెజార్టీ ప్రజలు అధికారంలోకి రావాలని...! మైనార్టీ ప్రజలను కాదు..?
ఓటును అమ్మకు పౌరుడా...?
సోయి తెచ్చుకొని ఈ దేశాన్ని కాపాడే బాధ్యతను తీసుకో.....!
************************************************************
బండి మొగిలి,
న్యాయవాది,
9989602566.
- Get link
- X
- Other Apps
Comments
Popular Posts
పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచితే సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏమిటి
- Get link
- X
- Other Apps


✍️👌
ReplyDelete