Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

ఈ దేశ శ్రమజీవికి పుట్టిన ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి...!

 

నవ తరంగాలు
ఒరిజినల్

ఈ దేశ శ్రమజీవికి పుట్టిన ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి...!

  దేశంలో పుట్టిన ప్రతీ ఒక్కడికి అన్నం పెట్టే రైతు ఎందుకు నష్టాల్లో ఉన్నాడు...?

  దేశంలో వ్యవసాయ సంక్షోభం ఎందుకున్నదో ఆలోచించారా...? 

 దేశంలోని అన్ని పార్టీలు మాది రైతు సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునేవే...!

  రైతుకు ఎందుకు నష్టం జరుగుతుందో ఆలోచన చేయండి..?

   ఇప్పుడు ప్రతి రైతు ఇంట్లో చదువుకున్న వారు ఉన్నారు...! 

  ఏది మంచి ఏది చెడు ఆలోచన లేకుండా ఉన్నారా...? కాదు నిర్లక్ష్యం మాకెందుకు అని...

అది తప్పు...!

  జ్ఞానం ఉన్నవారు ఒక్కసారి ఆలోచన చేయండి...? 

   మెజార్టీ ప్రజలు ఎందుకు ఒడిపోతున్నరో...!

   రోజు పొలంలో కష్టపడి తిండి లేకుండా ఎందుకుంటున్నరో...?

  రైతుల ఆత్మ హత్యల పరంపర ఎందుకు కొనసాగుతుందో...?

  ఈదేశాన్ని పాలిస్తున్న వారు రైతు కుటుంబాల నుండి వచ్చిన వారు కారు.

 మీరు గమనించండి...!

   ఇప్పటి వరకు దేశాన్ని పరిపాలించిన వారికి ఎవ్వరికీ రైతు కుటుంబాల నేపథ్యం లేక పోవడం, వారంతా వ్యాపార కుటుంబ నేపథ్యం నుండి వచ్చినవారు కాబట్టి రైతు సమస్యను రాజకీయంగా ఒకవైపు, వ్యాపార కోణంలో ఒకవైపు మాత్రమె వారి ఆలోచన దృష్టి ఉంటుందని గమనించండి....!

  ఎన్నో మానవ వనరులున్నా ఈదేశం ప్రపంచ అభివృద్ధి సుచికలో గత డెబ్బై ఐదేళ్లుగా ఎందుకు వెనుకబడి పోతుందో మనం అర్థం చేసుకోవాలి...!

 అర్థం చేసుకోనన్ని రోజులు ఈదేశ రైతులకు గిట్టబాటు ధర ఉండదు..! చదువుకున్న వారికి కొలువులు ఉండవు...! 

 వ్యవసాయం తెలియని వారికి అధికారం అప్పగించి అప్పులపాలు అయ్యమంటే తప్పెవరిది...?

   ఈ దేశంలో రైతును, దేవున్ని, ప్రజల అజ్ఞానాన్ని అసారచేసుకొని బ్రాహ్మణ, క్షత్రియ, కుటుంబాలు రాజకీయాలు చేస్తూ మెజార్టీ వ్యవసాయ కుటుంబాల ఓట్లతో అధికారంలోకి వస్తున్నా....!

 ఈ పార్టీలను అధికారం నుండి దింపండి...! 

   ఈ దేశంలో స్త్రీలు, బీసీలు 70కోట్ల మంది....!

 వారికి సంబందించిన బిల్లు అంబేద్కర్ ప్రవేశ పెట్టి డెబ్బై ఐదెల్లైన పార్లమెంట్ లో బిల్లు పాస్ కాలేదు ఎందుకో...? ఆలోచన చేయనంత కాలం మార్పు రాదు....!

   దేశంలోని అన్ని ప్రభుత్వాలు యువతకు  మద్యాన్ని అందుబాటులో ఉంచి వారిని నిద్రపుచ్చి ఓట్లు వేసుకొని ఈ దేశ యువతకు భవిష్యత్తే లేకుండా చేస్తున్నారు...! 

ఈ విషయాలను గమనించాలని కోరుతున్నా...! కాంగ్రెస్ పాలన మంచిగలేదని బీజేపీని, బీజేపీ పాలన మంచిగలేదని కాంగ్రెస్ ని అధికారంలోకి తెస్తే ఈ దేశం బాగుపడదు.

  ఇంకా నాశనమే...! 

కాబట్టి మెజార్టీ ప్రజలైన బీసీలు, స్రీలు, యువతీ యువకులు రైతులు అధికారంలోకి రండి...! లేకపోతే బ్రాహ్మణుల పార్టీల చేతుల్లో బానిసలు కావాల్సిందే....!

                                           బండి మొగిలి,

                                             న్యాయవాది,

                                           9989602566.  


Comments