Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

ఇప్పడు మునుగోడులో ఎమ్మేల్యే లేకపోతే ఏమైతది...?

 పిల్లలకు చదువు చెప్పుటకు ఉపాధ్యాయులను నియమించరు...!

   యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లును భర్తీ చేయ్యరు....!

కానీ ఏదో ఎత్తి పోయినట్లు మునుగోడు లో మాత్రం ఎన్నికలు జరుపుతరట....! 

  ఇప్పడు మునుగోడులో ఎమ్మేల్యే లేకపోతే ఏమైతది...? 

అసెంబ్లీలో బిల్లు పాసుకాదా..? మీరు ప్రజలకు చేసే అభివృద్ధి అగిపొద్దా....?

 ఒకడు గుడికట్టి అభివృద్ది అంటడు..! 

మరొక్కడు మద్యం ఊరూర సప్లయ్ చేసి అభివృద్ది అంటడు...! 

ఇదేనా...? 

ప్రభుత్వాలు ప్రజల కోసం చేసిన అభివృద్ధి...? 

  * రైతులకు గిట్టబాటు ధరలేదు,

   *రోగులకు సరైన వైద్యం లేదు,

   *నిరుద్యోగుల కు బృతిలేదు,

   *యువతి యువకులకు ఏ    అవకాశాలు లేవు,

  ఇంకా ఎన్నో ఏన్నోన్నో.....!

                                         బండి మొగిలి,

                                           న్యాయవాది,

                                         9989602566.



Comments