Search This Blog
Nava Tarangalu (translated as “New Waves”) is a widely circulated Telugu-language daily newspaper published in the Indian state of Telangana District Warangal, Hanamkonda Owned by BANOTH VIJAYKUMAR. Launched on 2021, the publication serves as a voice for regional and public issues.
త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు
- Get link
- X
- Other Apps
హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాల కారణంగా మానవుల్లో కుల కంపు చాలా తీవ్రంగా ఉంది...!

ఒక అంటరాని వాడు అగ్రకుల అమ్మాయిని ప్రేమిస్తే కోపంతో రగిలి అంటరాని ప్రేమికున్ని చంపిన సంఘటనలు ఎన్నో చూసాం...! కానీ.,
ఒక రెడ్డి అబ్బాయి తన సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తే కూడా హత్య చేస్తున్నారంటే మనుషుల్లో మతోన్మాదం ఎంత ఘోరంగా తలకెక్కిందో అర్ధం చేసుకోవచ్చు.!
మంథని మధుకర్ ఒక బిసీ అమ్మాయిని ప్రేమిస్తే జీర్ణించుకోలేని ఈ సమాజం మానవత్వం గురించి గొప్పగా మాట్లాడటం నాటకం కాక మరేమవుతుంది.!
యుక్త వయస్సులో ఉన్న పిల్లలు ప్రేమించుకుంటే తప్పేలా అవుతుందో యువతకు అర్థం కాక ఒకవైపు, వారి ప్రేమను, మనస్సును చంపుకొని కొందరు, చంపుకోలేక కొందరు విడిపోతున్నారు. మరి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు...!
మరి కొంతమంది పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకొని వారి కాళ్ళమీద వాళ్ళు నిలబడ్డా వెంటాడి వేటాడి చంపుతున్నారంటే.....! ఈ హత్యలను ఎవరాపాలి....?
గుండెల మీద ఆడించి, పాలించి, పెంచిన కూతురు ఏది అడిగితే అది క్షణాల్లో తెచ్చి ఇచ్చి పిల్లల కోర్కెలు తీర్చే తల్లిదండ్రులు....! వారు కోరుకున్న లైఫ్ పార్టనర్ విషయంలో మాత్రం కులాన్ని, మతాన్ని, పేదరికాన్ని భూతద్దంలో చూసి పిల్లల కోర్కెలను చంపేన్నారు..!
ఎందుకు...? ఈఘోరాలు ఆపే బాధ్యత ఎవరిది.? ఈ హత్యలను..! సమాజం ఆలోచన చేయాలి...!
వేధికల మీద కులం మతం లేదని అంతా సమానమని ప్రసంగించే నేతలు కూడా ఇలాంటి దుర్మార్గాలకు తెగబడుతున్నారు....! హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాల కారణంగా మానవుల్లో కుల కంపు చాలా తీవ్రంగా ఉంది...!
ఒక బీసీ మరో బీసీని ప్రేమించినా..?
ఒక ఎస్సీని మరో ఎస్సీ ప్రేమించినా...?
ఒక రెడ్డిని మరో రెడ్డి ప్రేమించినా...!
కూడా చంపుతున్నారంటే కులనిర్ములన చేయాల్సిన అవసరం ఎంతుందో యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది.....!
****************************
బండి మొగిలి,
న్యాయవాది,
9989602566.
- Get link
- X
- Other Apps
Comments
Popular Posts
పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచితే సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏమిటి
- Get link
- X
- Other Apps


Gudmsg sir
ReplyDelete