Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

జైళ్లల్లో మగ్గుతున్న వారిలో 80% మంది నేరం రుజువు కానీ బహుజన బిడ్డలే...!


 న్యాయ వ్యవస్థ నే ప్రక్షాళన చేయాలి...! సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ వి రమణ.
           ------------------------------------------
   జైళ్లల్లో మగ్గుతున్న వారిలో 80 శాతం మంది నేరం రుజువు కానీ బహుజన బిడ్డలే...!
""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
   దేశంలో చట్టం అమలౌతున్న తీరు చూస్తే పాలకులు కక్ష గట్టి బహుజన, శ్రామిక, కులాను నేరస్థులుగా మార్చి పాలన కొనసాగిస్తున్నట్లు స్పష్టంగా కనపడుతున్నది.
   ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ...! మొత్తం న్యాయ వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు చీప్ జస్టిస్ అన్నారంటే  న్యాయ వ్యవస్థ తీరు ఎలా ఉందో బహుజన సమాజం అర్థం చేసుకోవాలి...! 
  గత డెబ్బైఐదు ఏండ్ల నుండి మనల్లి పాలిస్తున్న పాలకులను అధికారం నుండి తప్పించి రాజకీయ అధికారాన్ని చేపట్టడమే ఇందుకు మార్గం..!
    అంతకు మించిన మార్గం లేదు...!
  దేశంలో ప్రస్తుతం అరు లక్షలపై చీలుకు నేరస్థులు విచారణ పూర్తి కాకుండానే జైళ్లల్లో మగ్గుతున్నారని అందులో 80 శాతం నేరస్థులు బహుజన బిడ్డలని తేలింది...! ఇది న్యాయ వ్యవస్థ తీరు....! 
  విచారణ జరపకుండా ఇంత పెద్ద సంఖ్యలో జైళ్లల్లో మగ్గి పోవడానికి అవకాశం ఈ వ్యవస్థ తీరును పౌర సమాజం  ప్రశ్నించే అవసరం ఉంది...!
  మానవ హక్కులు ఈదేశంలో ఒక పరిష్కారం లేని సమస్యలు గా మారిపోయాయి..!
 ప్రశ్నకు ప్రశ్నే  సమాధానంగా కనపడుతున్నదే కానీ... పరిష్కారం మాత్రం పాలకుల ఆలోచనల్లో కనపడటం లేదు...!
   మదేశ క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ పక్రియ నే ఒక శిక్షగా మారిందని పరివర్తన లేకుండా పాలకులు జాగ్రత్త పడుతున్నారని దీనిపై ప్రజలు అత్యవసరంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది...!

**********************************
                                                     బండి మొగిలి,
                                                      న్యాయవాది,
                                                            వరంగల్,
                                                    9989602566.
 



Comments

Post a Comment