Search This Blog
Nava Tarangalu (translated as “New Waves”) is a widely circulated Telugu-language daily newspaper published in the Indian state of Telangana District Warangal, Hanamkonda Owned by BANOTH VIJAYKUMAR. Launched on 2021, the publication serves as a voice for regional and public issues.
త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు
- Get link
- X
- Other Apps
కులసమస్య, మతసమస్య నిర్ములనైతే గాని ప్రేమికులకు విముక్తి కల్గెటట్లు లేదు...!
ఈ దేశ సంస్కృతి, సంప్రదాయాలు, ఎంత గొప్పగా ఉన్నాయంటే...!
ఆలోచన చేస్తేనే బలే అస్తక్తిగా ఉంటుది..!
పిల్లలను అన్నింటా ప్రేమించి, విలువిచ్చిన, తల్లిదండ్రులు వారు ఏది కోరిన క్షణాల్లో తెచ్చి ఇచ్చే తల్లిదండ్రులు ఎందుకో వారు కోరుకొన్న ప్రేమను మాత్రం ఇవ్వడం లేదు..! పైగా పరువు పేరుతో చంపివేస్తున్నారు.....!
ఒకడు, కులంతక్కువోన్ని చేసుకొన్నదని...!
మరోచోట పరాయి మతపోన్ని చేసుకొన్నదని....!
ఇంకొ దగ్గర తల్లి తండ్రుల మాటను కాదన లేక ఎంతో మంది ప్రేమికులు తనువు చాలిస్తున్నారు...!
ఈ మధ్య ఈలాంటి సంఘటన లు మనం నిత్యం చూస్తున్నాము...!
మరి పరిష్కారం ఏమిటి...?
కులసమస్య, మతసమస్య నిర్ములనైతే గాని ప్రేమికులకు విముక్తి కల్గెటట్లు లేదు...!
చట్టప్రకారం యుక్త వయస్సు వచ్చిన వారు పెండ్లి చేసుకోవచ్చని చట్టం చెపుతున్నా ఈ మతోన్మాదులకు, కులోన్మాదులకు చట్టం పై గౌరవం లేదు. మర్యాద అంతకంటే లేదు...!
చట్టం అంటే భయం లేకుండా చంపివేస్తున్నారంటే.... ఈ మారణహోమం ఆగేదెప్పుడు...?
కన్నా బిడ్డలను, తోబుట్టువులను పరువు పేర చంపడాన్ని ఎవరాపాలి...?
ఎక్కువగా, ఈ ప్రేమ, పరువు, హత్యలు, అంటరాని కులాల్లోనే ఎందుకు జరుగుతున్నాయి...?
అక్కడక్కడ బీసీల పరిస్థితి కూడా అలాగే ఉంది బీసీలు బీసీలను ప్రేమించినా చంపుతున్నారు...!
మరి పరిష్కారం....? ఏమిటి.....?
కులం, మతం నశించాల్సిన అవసరమైతే కచ్చితంగా కనపడుతుంది...!
మనిషికి సంబంధం లేకుండానే కులం అంటుకొని సచ్చే దాకా వదలడం లేదంటే...? ఎలా ఆత్మగౌరవంతో జీవించేది....?
మతం, కులం పేర హత్యలు చేస్తున్న వారిని చట్టం కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది...! కానీ ఎక్కడ చట్టం కఠినంగా అమలౌతున్నది..! కావడంలేదు కనుకనే ప్రేమ, పరువు హత్యలు, దర్జాగా చేసి....! కత్తులు పైకి ఎగరేస్తూ రాక్షసా అనందన్నీ పొందుతున్నారు...!
బయం లేకుండా, బయట తిరగడాన్ని చూస్తుంటే ....!
ఇప్పట్లో కులం, మతం నశించే టట్లు కనపడటం లేదు....? మరెట్లా...?
చర్చ చేయండి...!
****************************************
బండి మొగిలి,
న్యాయవాది,
9989602566.
- Get link
- X
- Other Apps
Popular Posts
పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచితే సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏమిటి
- Get link
- X
- Other Apps



Comments
Post a Comment