Search This Blog
Nava Tarangalu (translated as “New Waves”) is a widely circulated Telugu-language daily newspaper published in the Indian state of Telangana District Warangal, Hanamkonda Owned by BANOTH VIJAYKUMAR. Launched on 2021, the publication serves as a voice for regional and public issues.
త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు
- Get link
- X
- Other Apps
భారత పౌరులను బిచ్చగాళ్లుగా చేస్తున్నదెవరు....?
బహుజన ప్రజలారా....!
నా రక్త బందువులారా....! ఒక్కసారి ఆలోచించండి....!
******************************
ఈదేశాన్ని పాలించిన,పాలిస్తున్నా నేతల వల్ల దేశ ప్రజలకు జరుగుతున్న, అన్యాయాన్ని, నష్టాన్ని యువత ప్రశ్నించరా....?
దేశ ఆర్దిక పరిస్థితిని దిగజారిస్తున్నా నేతలను, అధికారంలోకి తేవడమే లక్ష్యంగా మన ఆలోచన ఉన్నట్లు కనపడుతోంది.
ఈదేశాన్ని పాలిస్తున్నా ప్రతి పార్టీ, దేశ సంపదను ప్రపంచ బ్యాంకు కు వడ్డీ రూపంలో కట్టబెట్టి ప్రపంచ జనాభా లో రెండో స్థానంలో ఉన్నా భారతదేశ పౌరుల్లి బిచ్చగాళ్లుగా చేస్తున్నదెవరు....? ఆలోచన చేయ్యారా...?
ఈదేశ ప్రజల నుండి పన్నుల రూపంలో వస్తున్న సంపద ను ఒకవైపుసంపన్నులకు సబ్సిడీ లు ఇస్తూ మరోవైపు దేశాఅభివృద్ధి కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ ఈడెబ్భై ఐదు సంవత్సరాలు గడిపారు.ఇంకా పాలిస్తూనే ఉన్నారు. అధికారం కోసం ఉచిత పథకాలు,రుణాల మాఫీ, తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తామని కేంద్ర, రాష్ట్ర,ప్రభుత్వాలు పోటీ పడి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెదజల్లి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారే కానీ ఈ దేశ,రాష్ట్ర యువత, విద్యార్థుల కోసం ఒక పరిశ్రమ, ప్యాక్టరి, అదీకాక కనీసం స్వయం ఉపాధి అవకాశాలు కూడా కల్పించక పోవడంతో దేశ,రాష్ర్టంలోని యువతరం దారి తప్పి ప్రజాస్వామ్యం అంటేనే గౌరవం లేకుండా పోతుంది....!
మరి ఇలాంటి పరిస్థితి కి కారణము ఎవరు...?
ఈదేశంలో ఏదైనా ఉత్పత్తి జరుగుతున్నదా...? లేదు...!
ప్రభుత్వ పరిశ్రమలు ఫ్యాక్టరీలు, ఉత్పత్తి రంగం, పాలకుల విధానాల వల్లమొత్తం కుప్పకులిపోయాయి...!
ఈదేశ ప్రజల అవసరాలకు కావాల్సిన ప్రతి వస్తువు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవడమే మన పాలకులు చేసిన అభివృద్దా...?
ఈదేశంలో పెట్టుబడులు పెట్టి సంపదను సృష్టించుకొని దేశ సంపద ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం కోసమే మనం వీరిని ఎన్నుకున్నట్లు వీరి వైఖరి ఉంది...!
మరి మనం వారిని మార్చడం కోసమే మనం మారాలి...! లేకపోతే మన మనుగడకే ప్రమాదం...! ఆలోచన చేయండి....!
బండి మొగిలి,
న్యాయవాది,
9989602566.
- Get link
- X
- Other Apps
Comments
Popular Posts
పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచితే సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏమిటి
- Get link
- X
- Other Apps



Very good concept
ReplyDeleteIt is need for people especially youth
Youth must out come from their sleep.
Thank you sir for your writing and thinking and spending on society benifits
Gudmsg sir tq
ReplyDelete