Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

బహుజనుల బతుకులను మార్చడం కోసం బయలు దేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతిచ్చి ఆయనతో కలిసి నడవడమే...! మనం అంబేద్కర్ కిచ్చే నిజమైన నివాళి...!

 

   ఓట్లు మావి...! సీట్లు మీవా..?

                ఇకపై సాగదు...! ఇకపై చెల్లదు...!


   మేము ఎంత మందిమో..! మాకంత వాటా కావాలి..!

    దళిత బడుగు బలహీన వర్గాల సామాజిక ప్రజాస్వామ్యమే....! మన దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం....!

 మేలు కొందాం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్నిఏలుకొందాం...!

   జయం మనదే...! ఎందుకు ఆలోచిస్తున్నావు...?

  బహుజనుల బతుకులను మార్చడం కోసం బయలు దేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతిచ్చి ఆయనతో కలిసి నడవడమే...!

   మనం అంబేద్కర్ కిచ్చే నిజమైన నివాళి...!

  ఎన్నో ఏళ్ల నుంచి అనేక అగ్రవర్ణ, మనుధర్మ పార్టీలకు ఓటు వేశారు ఏమైంది ( ఏమి ఒరిగింది )...? 

   సుమారు 60 సంవత్సరాలు అగ్రవర్ణ పార్టీల కబంధ హస్తాల క్రింద నలిగి పోవడం తప్పా....!

 భూమి దక్కిందా....! ఉద్యోగం వచ్చిందా...!

    ఏదైనా మార్పు వచ్చిందంటే అది పూలే, అంబేద్కర్ ల కృషి వల్లనే...!

   డబ్బులకు ఓట్లు వేసి అగ్ర వర్ణ పార్టీలను అధికారంలోకి తెచ్చి మనం  బిచ్చగాళ్లమయ్యాం కాదంటారా....!

   ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణలో దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తా అని చిలుక పలుకులు పలికిన  కేసీఆర్ ఏం చేశారు...?

    భూమి ఇస్తానన్నాడు...! ఇచ్చాడా...?

    ఉద్యోగాలు ఇస్తానన్నాడు...! ఇచ్చాడా..?

   అమలు సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చి నియోజకవర్గానికి వందమందికి పథకాలు ఇచ్చి రాష్ట్రంలోని మన ఓట్లను వేసుకొని అధికారాన్ని చెలయిస్తున్న కేసీఆర్ కుట్రలను జ్ఞాన సమాజం ఎప్పుడూ గుర్తిస్తుంది....!

   పాట పాడే వాడు మనోడే...! పాట రాసే వాడు మనోడే...!

   ప్రజల కష్టాలను, ఇబ్బందులకు ఆ పార్టీ కారణమని ఒకడు, మరో పార్టీ కారణమని ఇంకొక్కడు బహుజన సమాజాన్ని మోసం చేస్తూనే ఉన్నారు...! 


   మరి నిజం ఏమిటి....?


       ఆలోచిందెప్పుడు...?


   రాజ్యం రాకుండా, రాజ్యం లేకుండా, బహుజనుల కష్టాలు పరిష్కారం కావడం సాధ్యం కాదని, తన ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలి బహుజన సమాజ ఉద్ధరణ కోసం ప్రయాణం మొదలెట్టిన ఆర్, ఎస్, ప్రవీణ్ కుమార్ తో జతకట్టండి..!

  ఈ సమయంలో ఆయనతో బహుజన సమాజం కలిసి నడవకపోతే ఎప్పుడూ ( ముందుతారం ) బహుజన సమాజం బానిసత్వం అనుభవించాల్సిదే...!

   కాబట్టి రిజర్వేషన్ పంచాలన్న వారు, మహా రాజులను చేయాలన్నావారు, అంబేద్కర్, ఫూలే ల పేరుతో సంఘాలు పెట్టుకున్న వారు, అంతా మీ వ్యక్తిగత జెండాలను పక్కనబెట్టి ఒక్కసారి బిఎస్పీ ని బలపరచండి..! 

    కులాల కుంపట్లను పక్కనపెట్టి అందరూ కలిసి కట్టుగా బహుజన రాజ్యాధికారా యాత్రని   జయప్రదం చేద్దాం రండి....!

                                              బండి మొగిలి,

                                                న్యాయవాది,

                                               9989602566.



Comments

Post a Comment