
ఈ దేశంలో పేదలకు నూతన సంవత్సరాలు ఉంటాయి...!కానీ నూతన జీవితాలు మాత్రం లేవు...!
సంవత్సరాలు మారిపోతున్నా గాని పేదల ప్రగతికి పక్క అభివృద్ధి పథకానికి ప్రణాళికలు లేవు....!
కానీ...!
పేదల ఓట్లు ఎలా వేసుకొవాలో ఎలా అధికారంలోకి రావాలో అన్నా విషయాల్లో మాత్రం అన్ని పార్టీలకు గొప్పగా ప్రణాళికలు ఉంటాయి...!
దానికి ప్రధాన ఉదాహరణగా హుజురాబాద్ ఎన్నికను చెప్పవచ్చు...!
నిలబడ్డ ప్రతిపార్టీ కవర్లో డబ్బులు పెట్టి పేదలకు (ప్రజలకు)పంచి పెట్టినా...?
ఈ అనైతిక చర్యను పోలీసులు గాని, ఎన్నికల కమిషన్ గాని అడ్డుకోదు పట్టించుకోదు...!
ఇది సిస్టం...!
మా ఓట్లకు డబ్బులివ్వలేదని హుజురాబాద్ ఓటర్లు రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నారంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ను పాలకులు ఎటు తీసుక పోతున్నారో ప్రజలు మేధావులు ఆలోచన చేయాలి....!
రాజ్యాంగాన్ని కూర్పు చేస్తున్నా సమయంలో సనాతన భారతీయ ధర్మాన్ని పాటిస్తున్నా అనేక మంది జాతీయ మనువాదులను ఒప్పించి అందరికి ఓటు హక్కు అంబెడ్కర్ కల్పిస్తే ఆ ఓటును అమ్మడమెట్ల అని ఓటర్లు ఆలోచిస్తున్నారే కానీ ఆ ఓటుతో వారి జీవితాలు ఎలా మారుతాయో అర్థం కాకుండా పాలకులు చేస్తున్నా సంగతి మేధావులు ఆలోచించాలి.
ఓటు విలువ, వారికి తెలియకుండా చేసి ఎన్నికలంటే బోలెడు ఖర్చు అని మానసికంగా పేదలను క్రుంగదీసి, ఎన్నికల వైపు సామాన్యలను వెళ్లకుండా చేస్తున్నారు.
భారత ఎన్నికల కమిషన్, డబ్బున్నా వాళ్ళ కోసమే చేసినట్లుగా ఉంది పరిస్థితి...!
అసెంబ్లీ, పార్లమెంట్ భవనాలు కాంగ్రెస్, బిజెపి, టీఆర్ఎస్, టీడీపీ,మిగితా పార్టీల కోసమే కట్టారన్నా భ్రమలోకి ప్రజలను నెట్టివేశారు...!
ప్రజలకోసం ప్రభుత్వాలు బార్ షాపులు, ఓపెన్ చేసి అందులో పేదలకు రిజర్వేషన్లు ఇచ్చారు, మద్యం అమ్మడం వల్ల ఒక కుటుంబం బాగుపడ్తే, కొన్ని వేల, లక్షల కుటుంబాలు మద్యం తాగడం వల్ల ఆర్ధికంగా, ఆరోగ్యంగా దెబ్బతింటున్నాయి. ఈ విషయం ప్రభుత్వాలకు తెలియదనుకోవాలా..?
భూమి ఉన్నా రైతులకు రైతు బంధు,రైతు భీమా,భూమిని దున్ని తిండి పెడుతున్నా కౌలు రైతుల కోసం గాని కూలీల కొసం గాని ప్రభుత్వం ఆలోచించకపోవడమే కాక వారి శ్రమను దోపిడిచేస్తున్న సంగతిని ఎవరాలోచించాలి...?
వృద్దులకు పెన్షన్లు, మహిళలకు వడ్డీలేని రుణాలు, పావుల వడ్డి తో రుణాలని, ఇంకా ఎన్నో పనికి రాని పథకాలు పెట్టి ప్రజలను మభ్యపెట్టి ఐదేళ్లకోసారి ఓట్ల పండుగ చేసుకొంటున్నా పార్టీలకు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్పేరోజు కచ్చితంగా వస్తుంది అందులో సందేహం లేదు,అంతేకాకుండా ప్రజలకు నాణ్యమైన విద్యా, వైద్యాన్ని ప్రజలకు అందించకుండా దోపిడీ చేస్తున్నాయి...?
ఇంత జరుగుతున్న కానీ రాజ్యాంగ సంస్థలు మాకెందుకన్న భావనతోనే ఉన్నాయే తప్ప దోపిడిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోక పోవడం వల్ల ప్రజలకు రాజ్యాంగ సంస్థల మీద నమ్మకం లేకుండా పోతుంది...!
అంబెడ్కర్ ఎన్నో వ్యయ, ప్రయసాలకు ఓర్చి ప్రజలకు కల్పించిన హక్కులను ఒక వైపు పాలకులు,మరో వైపు రాజ్యాంగ సంస్థలు నాశనం చేస్తుంటే...!
భారత రాజ్యాంగం పై ప్రజలకు నమ్మకం లేకుండా పోతుంది...!
దింతో ప్రజలు తిరుగుబాటు ఉద్యమాలు ఎంచుకొని వారి జీవితాలను త్యాగం చేస్తూ అగ్రవర్ణ పార్టీలకు ఉపయోగపడుతున్నారే గాని....!
అధికారం లేకుండా ఈ దేశంలో పేదలకు హక్కులు అందవన్నా సంగతిని తెలియకుండా పాలకులు చేస్తున్నారు.
ఆర్థిక భారం మీద పడుతున్నా సంస్కృతి పేరుతో దోపిడీ, వైద్యం పేరుతో దోపిడీ, నాణ్యమైన విద్యకోసం కూడా ప్రజలు దోపిడీకి గురవుతున్నారు.
ప్రజాస్వామ్యం లో ప్రజల మౌలిక హక్కులకు విలువ లేకుండా కార్పొరేట్ సంస్థలు చేస్తున్నాయి.
పాలక ప్రభుత్వాలు ప్రభుత్వ సంస్థలన్నిటిని ప్రైవేటు పరం చేస్తున్నా ఎవ్వరికీ పట్టింపు లేదు.
దానికోసం పోరాడే వారిని నయానో, బయానో, దారికి తెచ్చుకొని కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను తీర్చుకొంటున్నారు...!
కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పడ్డ కార్మిక సంఘాలు, నేతలు అంతా అధికార దర్పం మోజులో పడి కార్మికులు సమస్యలు గాలికొదిలేశారు...!
ఈ దేశంలో ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నా తీవ్రవాదులను పోలీసులు చంపిన సందర్భంలో కొంతమంది సంతోష పడితే, త్రీవాదుల చేతిలో పోలీసులు చనిపోతే కొంతమంది ఆనంద పడుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం...!
ఇద్దరు మన రక్తబందువులే మనదేశ పౌరులే అన్నా సంగతిని మరిచిపోయాం...!
మరి నిజాలేమిటి...? తేల్చాలింసిందేవరు...!
పాత సంవత్సరం వెళ్లిపోతుంది. అలా చాలా సంవత్సరాలు వెళ్లిపోయాయి. కొత్త సంవత్సరాలు చాలా వచ్చాయి. ప్రజల,జీవన విధానంలో మార్పు వచ్చిందా..? రాలేదు ఎందుకు...? ఒక్కసారి ఈ దేశ పౌరుడిగా ఆలోచన చేయ్యి...! ఇప్పుడు ఒక్క కులం పార్టీలు ఎందుకు అధికారంలోకి వస్తున్నాయో ఆలోచన చేయ్యి.. నువ్వు ఆలోచన చేయనంత కాలం పేదల జీవితాలు మారవు...!
ప్రతి కొత్త సంవత్సర మొదటి రోజు నేను, నా కుటుంబ సభ్యుల జీవితం బాగుపడాలని ఆశిస్తూ వేడుకలు జరుపుకుంటున్నాము.
కానీ మనల్ని పాలించే వాళ్లలో, వ్యవస్థాగత విలువల్లో మార్పు రాకుండా మన బతుకుల్లో మార్పు రాదనే చిన్న లాజిక్ ఎలా మిస్సవుతున్నారో తెలియట్లే.
అయినప్పటికీ,
నూతన సంవత్సర వేడుకలు జరుపుకొంటున్నా మిత్రులందరికీ, రానున్న రోజుల్లో భారత రాజ్యాంగం కలిపించిన హక్కులన్నింటిని అనుభవించడానికి ప్రణాళిక బద్దంగా ప్రజలు వ్యవరించాలని కోరుతూ... మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు....!
****************************************************************************
బండి మొగిలి,
న్యాయవాది,
9989602566.
Super write-up anna.. tq jai bhim
ReplyDeleteSuper anna
ReplyDelete