Search This Blog
Nava Tarangalu (translated as “New Waves”) is a widely circulated Telugu-language daily newspaper published in the Indian state of Telangana District Warangal, Hanamkonda Owned by BANOTH VIJAYKUMAR. Launched on 2021, the publication serves as a voice for regional and public issues.
త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు
- Get link
- X
- Other Apps
రైతు చట్టాలకు పార్లమెంటులో మద్దతు ఇచ్చిన కేసీఆర్ గారు...!
రైతు చట్టాలకు పార్లమెంటులో మద్దతు ఇచ్చిన కేసీఆర్ గారు...!
రైతులు పండించిన పంటను కొనుగోలు చెయ్యమని ఇప్పుడు డిమాండా....?
ఇదెక్కడి అన్యాయం...?
పైగా రైతు పండించిన పంటలను కొనుగోలు చెయ్యకపోతే ధర్నాలు చేస్తామని తెలంగాణ ప్రజలను పిలుపు కుడా ఇచ్చారు...!
అప్పుడు రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇచ్చిన మీరే పోరాటం చేస్తామంటే ఎలా...?
మీకు అవసరమైన సమయంలో దేశాన్ని నాశనం చేసే దుర్మార్గమైన చట్టాలకు మద్దతు ఇచ్చారు. జిఎస్టి బిల్లును ఆమోదించారు మీరు. మోదీ ఏది చెబితే అది చేశారు. మీ లాలూచితనం వల్లనే ఇక్కడ బిజెపి బలపడ్డది. మీ పోరాటం వల్ల కూడా అది బలపడే వీలున్నది. ఆలోచించుకోండి.
ఇక బీజేపీ పార్టీ నేతల తీరు చూస్తే...!
అస్సలు రైతు అనే వాడే కనుమరుగై పోవాలనే లక్ష్యంతో కేంద్రం తన ప్రణాలికను అమలు చేస్తున్నది...!
అందులో భాగంగానే రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిన బీజేపీ ఇప్పుడు తెలంగాణ లో రైతు అనుకూల పోరాటం చేస్తున్నామని కలర్ ఇస్తున్నాయి...!
బీజేపీకి ఎప్పుడైనా రైతుల కోసం పోరాడిన చరిత్ర ఉందా...?
సర్దార్ వల్లబాయ్ పటేల్ చేసిన పోరాటాన్ని బీజేపీ తన ఖాతలో వేసుకుని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నది...!
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలకు, లబ్ది చేకూర్చే చర్యలకు పూనుకుంటే కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, దళితులు, బీసీలు, ఆత్మహత్యలు చేసుకొంటున్నారు...!
బీజేపీ, కేసీఆర్ పాలనలో పేదలకు చివరికి అన్యాయమే జరుగుతున్నదని వర్తమానం చెప్పుతున్నది...!
కేంద్రం కార్పొరేట్ కోసం, కేసీఆర్ అగ్రవర్ణాల కోసమే పనిచేస్తున్నారన్నా సంగతిని ప్రజలు గుర్తుపెట్టుకుంటే మంచిది....!
లేకపోతే చాణిక్యుల వొలలో చిక్కి సమీదలు కావాల్సిందే..!
రాజకీయ వధ్య శిల మీద బహుజనులు బలి కానున్నారా?
లేక బహుజన రాజ్యం కోసం పోరాటం చేస్తారా...?
తేల్చుకోండి...! 🙏🙏🙏🙏🙏
****************************************************************************
బండి మొగిలి,
న్యాయవాది,
9989602566.
- Get link
- X
- Other Apps
Comments
Popular Posts
పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచితే సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏమిటి
- Get link
- X
- Other Apps
బహుజన రాజ్యము వస్తేనే ఈ బహుజన వ్యతిరేక రాజకీయ రాబందు లను తుదముట్టించగలము..
ReplyDeleteకేంద్రా మరియు రాష్ట్రా రాజకీయాలు బహుజన హస్తగతం కావడం ఈ చాటు మాటు చాణీక్యులు చూసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి అన్నయ్య..
జై భీమ్...! జై బహుజన...!!
👌
ReplyDeleteనిజంగా ప్రజలు ఎప్పుడూ చైతన్యం అవుతారో sir, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయి.
ReplyDelete-మధు సార్వభౌమ
కాకతీయ విశ్వవిద్యాలయం.
బహుజన వాదంతో ఉన్నా వందలాది సంస్థలు మరియు సంఘాలు సంఘటితమై రాబోయే ఎలక్షన్ లో BSP నీ అధికారం లోకి తీసుకోవాలి. అంబేద్కర్ వాదంతో పోతే రాజ్యాధికారం మన సొంతమే. వివిధ పార్టీ లో ఉన్నటువంటి బహుజన వాదులందరూ ఈ ఒక్క సారి అంటే రాబోయే ఎలక్షన్ లో ఒక్కటై BSP లో చేరి మనల్ని మనం గెలిపించుకొని మన బహుజన రాజ్యాన్ని సాధించుకోవాలి.
ReplyDeleteబహుజన వాదం వర్ధిల్లాలి అంబేద్కర్ కలలు కన్న రాజ్యం మన చేతి లోకి రావాలి.