Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

రైతులకు మేలు చెయ్యాలని లొల్లి పెట్టుకొంటున్నా అధికార పార్టీలు.

 


రైతులకు మేలు చెయ్యాలని లొల్లి పెట్టుకొంటున్నా అధికార పార్టీల (బిజెపి టి ఆర్ ఎస్) తీరు చూస్తే ఈ రెండు ప్రభుత్వాలు రైతులను, ప్రజలను,విద్యార్థులను, ఉద్యోగుల ను, మోసం చేస్తున్నాయన్న విషయం అందరికి అర్థమౌతుంది...!
   ఎందుకంటే....? 
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు లో పెట్టిన  అన్ని బిల్లులకు కేసీఆర్ మద్దతు ఇచ్చి  ఇప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుందని,  ధర్నా చేస్తుంటే, 
ఏమనుకోవాలో ఇంకా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సి ఉంది! 

టిఆర్ఎస్, బిజెపి రెండు పార్డీలు వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలే అనుసరిస్తున్నాయి. మిల్లర్లు, కాంట్రాక్టర్లే ఎక్కువ లబ్ధి పొందుతున్నారనేది వాస్తవం. కెసిఆర్ మీద బిజెపి, బిజెపి మీద కెసిఆర్ ఆరోపణలు చేసుకోవడం ద్వారా ఒక అభూత రాజకీయ ఘర్షణను సృష్టించారు గానీ ఆ రెండు పార్టీలు ఒకే తాను ముక్కలు ‌ 
   ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో  పెద్దగా అవినీతి జరిగిందని దాన్ని వెలికి తీసి జైల్లో పెడతామని మూడేళ్ళ నుండి బీజేపీ కేంర్ద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర నేతలు ఒకరిని మించి ఒకరు ప్రకటనలు ఇస్తున్నారే కానీ  తెలంగాణ ప్రభుత్వం పై గాని కేసీఆర్ పై గాని ఇప్పటి వరకు అవినీతి జరిగిందని విచారణ చేయమని అధికారిక ఆదేశాలు కేంద్ర దర్యాప్తు సంస్థలకు  ఎందుకు ఇవ్వలేదో తెలియదు...!
  ఈ విషయం లో బీజేపీ పార్టీ వైఖరేమిటి..? స్పష్టం చేయాలి...? కెసిఆర్ ను ఎప్పుడు జైలులో పెడుతారో కూడా బిజెపి నాయకులు చెప్పాలి. 
   ప్రజలారా...!
  మెజార్టీ గా ఉన్నా ఎస్సీ, ఎస్టి, బీసీల ఓట్లతో  అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వవాలు మన ప్రజల అభివృద్ధికి ఎప్పుడు పునుకోరు...! ఎందుకంటే...?  బహుజన సమాజం బాగు పడ్తే వారికి రాజకీయ జీవితం ఉండదు...!
 కాబట్టి బహుజన మేధావుల్లారా...? ఆలోచన చేయండి..! బహుజన రాజకీయాల వైపు మీరంతా ఐక్యమై ఉద్యమించండి...!

   *********************************
                                               బండి మొగిలి, 
                                                 న్యాయవాది,
                                               9989602566.


Comments

  1. జై భీమ్ సర్,వ్యాసం చాలా గొప్పగా వివరణాత్మకంగా రాసారు.

    ReplyDelete

Post a Comment