Search This Blog
Nava Tarangalu (translated as “New Waves”) is a widely circulated Telugu-language daily newspaper published in the Indian state of Telangana District Warangal, Hanamkonda Owned by BANOTH VIJAYKUMAR. Launched on 2021, the publication serves as a voice for regional and public issues.
త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు
- Get link
- X
- Other Apps
రాక్షస జాతిపై విజయమే "దీపావళి పండుగ"
రాక్షస జాతిపై విజయమే "దీపావళి పండుగ" అని గత కొన్నిలక్షల ఏళ్లుగా ప్రజలు జరుపుకుంటున్న దీపావళి గురించి....!
ఒకసారి చర్చ చేసుకుందాం...!
మొదట రాక్షస జాతి అంటే ఎవరు...? వారు ఇప్పుడు ఉన్నారా...?ఉంటే వారి సంతతి ఎక్కడుంది...?
వారు చేసిన నేరం ఏమిటి...?వారిని సంవత్సరానికి ఒక్కసారి ఎందుకు కాలుస్తున్నట్టు....? కాల్చబడే జాతి వారసత్వం ఎవరిది...?
భారతదేశ పౌరులు ఎప్పుడైనా ఆలోచించారా....?
సత్యభామా అనే మహిళ నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజే దీపావళి అని చెప్పుతున్న మనువాదులు...!
అసలు సత్యభామ ఏ ప్రాంతానికి చెందినదో, ఏ రాజ్యానికి రాణో చెప్పాలి....?
హిందూ మత సంప్రదాయం ప్రకారం ఒక స్త్రీకి చదువుకునే హక్కు, పరిపాలన చేసే హక్కు, ఆయుధాన్ని పట్టుకునే హక్కు, అసలు ఏ హక్కు లేకుండా బానిసలా బతకాలని హిందూ మతం స్త్రీని ఆజ్ఞాపించారు కదా....!
మరి అలాంటప్పుడు సత్యభామకు విలువిద్య తెలిసే అవకాశం లేదు. ఆమెకు ఆయుధం పట్టే హక్కే లేదు. యుద్ధ రంగంలోకి ఆడవాళ్లకు అనుమతి లేదు. బాణాన్ని(ధనస్సు)ను ఉపయోగించే హక్కే లేనప్పుడు సత్యభామ నరకాసురుని సంహరించడం అబద్ధం అని తెలుస్తుంది...!
మిత్రులారా...! దీపం జ్ఞానానికి ప్రతీక. వర్షాకాలం అంతా బుద్ధుడు ఎటూ వెళ్లకుండా ధ్యానంలో వుండేవాడు. శీతాకాలం ఆరంభం కాగానే బుద్ధుడు జ్ఞాన బోధ చేస్తూ సంచరించే వాడు. ఆ బుద్ధ భగవానునికి స్వాగతం పలుకుతూ వీధులు, యిల్లలో దీపాలు పెట్టే వాళ్లు. అదే సంప్రదాయం అశోకుడు కొనసాగించాడు. అదే అశోక దీపావళి. ఇదీ అసలు చరిత్ర. కానీ పుక్కిటి పురాణాలను చెబుతూ బ్రాహ్మణిజంలోకి అందరినీ లాగుతున్నారు.
ఇంకా మనమంతా సమానమైన మానవులం. మనందరికీ సమానమైన హక్కులు రాజ్యాంగం కల్పించింది. అటువంటప్పుడు బ్రాహ్మణ వర్గం అబద్ధపు ప్రచారాలతో ఈదేశ ములవాసులందరిని రాక్షస జాతిగా పరిగణిస్తున్నా బ్రాహ్మణ సంప్రదాయాలను మనం ఎందుకు కొనసాగించాలి....!
మనలను బానిసలుగా చేసిన బ్రాహ్మణ గ్రంథాలను తిరస్కరిస్తూ, మనుషులుగా గుర్తించి హక్కులిచ్చిన రాజ్యాంగాన్ని గౌరవిద్దాం...!
ఏమంటారు....?
********************************
బండి మొగిలి,
న్యాయవాది,
9989602566.
- Get link
- X
- Other Apps
Comments
Popular Posts
పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచితే సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏమిటి
- Get link
- X
- Other Apps
Nice
ReplyDeleteYes correct sir , Brahmana bhavajalam tho jaripe anni pandugalanu bhahiskarinchali
ReplyDeleteGreat words sir tq
ReplyDeleteఅన్నయ్య చాలా తక్కువ పంక్తుల లోనే చాలా చాలా ఎక్కువ సమాచారము పొందుపర్చిన మీ మేధస్సుకు నా 🙏🏻 పాదాభివందనం
ReplyDeleteచాలా బాగా చెప్పారు అన్నగారు ఎందుకంటే ప్రజలు ఏ పండుగ ఎందుకు చేసుకుంటున్నారో కూడా తెలియదు వారికి తెలియజేసే బాద్యతా మీలాంటి మేధావులదే చాల తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నా.....జై భీమ్
ReplyDelete