Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

రామాయణం, మహాభారతాలు, భారతదేశంలో వేల సంవత్సరాల నుండి భారత ప్రజలకు మహాకావ్యాలుగా వర్ధిల్లుతున్నాయి...!

 


రామాయణం, మహాభారతాలు, భారతదేశంలో వేల సంవత్సరాల నుండి భారత ప్రజలకు మహా కావ్యాలుగా వర్ధిల్లుతున్నాయి...!

    ఇప్పటికీ.... ఇవే ఈ దేశ పౌరులకు  పవిత్ర గ్రంధాలు...!

    ఈ గ్రంథాల్లో  తల్లిదండ్రుల మాట జవదాటకుండా ఉండడం..! భార్యా, భర్తల అన్యోన్యత, అన్నదమ్ముల అనుబంధం...!

   ఇంకా....!

 మానవత్వం తదితర విషయాలను కథా వస్తువులుగా తీసుకుని పూర్వంలో  ఎంతో మంది కవులు, రచయితలు పై విషయాలపై వర్ణన చేసి పెద్దవారైనారు.

    కానీ....!

     ఇప్పుడు సమాజంలో పరిణతి చెందిన వాటి నుండి పుట్టిన ఈ కథలు, ఆధునిక దృష్టి కోణంతో చూస్తే ఈ కట్టు కథలు నిలబడవు... !

 ఎందుకంటే.....?

    ఈ కథల్లో అస్సలు నైతికత కనబడదు...!

    సమాజం అభివృద్ధి చెందుతున్న దిశలో ఇవ్వన్నీ సృష్టించిన కథలన్న విషయం....! జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి బోధపడుతుంది....!

    వెయ్యేళ్ల నాటి సమాజానికన్నా, వందేళ్ల నాటి సమాజం పరిణతి చెందింది....!

   వెయ్యేళ్ల నాటి ఆచారాలు, నమ్మకాలు, సంస్కృతి పేరుతో, పాటిస్తామంటే వారినే మనాలి....!

   చారిత్రక ఆధారాలు లేని, కల్పిత పాత్రల కోసం, అల్లరిమూకలు సంస్కృతి పేరుతో చెలరేగిపోవడాన్ని ఎవరు హర్షిస్తారు ...?

  మత విశ్వాసాలన్నీ పక్కనపెట్టి, వైజ్ఞానిక స్పృహకు విలువనివ్వడం నేర్చుకున్నప్పుడే మన దేశం పురోగమించి, మనకు మంచి రోజులు వస్తాయి.....!

                    కాదంటారా....?

    ******************************


                                            బండి మొగిలి,

                                             న్యాయవాది,

                                           9989602566.



Comments