Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

అంటరానివారి చేతులతో మంచినీళ్లు త్రాగడానికి నిరాకరించిన ఈ దేశంలో...!

 


అంటరానివారి చేతులతో మంచినీళ్లు త్రాగడానికి నిరాకరించిన ఈ దేశంలో...!  
   ఒక జంతువు మూత్రము ఎంతో సంతోషంగా తాగుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం...!
     ఈ విషయంలో భారత దేశ ప్రజలు వారి భావన, మానసిక స్థితి, ఎలాగ, ఉందో దేశంలోని మేధావులు, జ్ఞానులు గమనిస్తూనే ఉన్నారు...!
   కాగా...!
    నేటి యువతరం  గోమూత్రం త్రాగుతున్న వారిని ఒక ప్రశ్న అడుగుతున్నది....?
 ఏమిటి... ఆప్రశ్న...?
    గోమూత్రం అంత పవిత్రమైనప్పుడు, దేవుళ్ళ అభిషేకాలకు ఎందుకు గోమూత్రం వాడటం లేదన్నది ఈ యువతరం ప్రశ్న....?
   ఈ దేశంలోని యువతకు, మహిళలకు మేదులుతున్నా ప్రశ్న....? దీనికి ఎవరు సమాధానం చెప్పుతారో అని
   చాలా రోజుల నుండి ఎదురుచూస్తుంది యువతరం....!
 దేశంలోని ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి ఉన్నారు...!
    ఒక వర్గం వివేకవంతులు కాగా, మరొక వర్గం మూర్ఖులుగా  చలామణి అవుతున్నారు...!
    మూర్ఖులు మాత్రం జాతి, రంగు, లింగ, బేదాలతో వర్గీకరించికొని విభజించ బడుతున్నారు...!
   ఆదివాసీ గూడల్లో దేవుడు అంటే తెలియని మూలవాసి ప్రజల పసి హృదయాల్లో సరస్వతి శిశు మందిర్ల పేరిట వారి ఆచారాలను కలుషితం చేస్తూ వారి మనసుల్లో విషాభిజాలు నింపుతున్నారు...!
    ఈ విషయంలో గిరిజన, ఆదివాసీ, ప్రజలు జాగ్రత్త పడాలి....!
 పడి వాస్తవం వైపు నడవకపోతే గిరిజనుల జీవితల్లో అందకారం  రాజ్యమేలడం ఖాయం...!
    ప్రపంచంలో సుమారు ఐదు వేల మతాలు ఉన్నాయి...!
 అందులో ఏ ఒక్క మతం మనుషులంతా సమానమని  చెప్పలేక పోయింది...! అంతేకాదు సమానంగా ఉంచ లేకపోయింది...!
 దీనికి కారణాలేమిటి .....?  
   మన పౌరసమాజం ఆలోచన చేయాలి కదా....!
             💐💐💐💐💐💐💐💐💐
                                                బండి మొగిలి,
                                                  న్యాయవాది,
                                                        వరంగల్,
                                                9989602566.



Comments

Post a Comment