

తెలంగాణ రైతాంగ పోరాటం చరిత్రను మార్చే ప్రయత్నం చేయడంలో మతతత్వ పార్టీలు అన్ని సఫలం అవుతున్నట్టు కనబడుతున్నది..! పుక్కటి పురాణాల చరిత్రే రేపటి తరానికి నాంది కాబోతుందా అన్న సందేహం కూడా కలుగుతున్నాయి...!
పిల్ల పుట్టిన నాటి నుండి కాటికెళ్లే వరకు నిత్యం మను వాదాన్ని అనుసరించకుండా ఉండే పరిస్థితి లేదు...!
నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరులైన కమ్యూనిస్టు అమరవీరులకు బిజెపి దాని అనుబంధ సంస్థల నేతృత్వంలో పిండలు పెట్టి వారి లౌకిక భావ పరమైన త్యాగాన్ని సైతం మనువాదం లో కలిపే ఒక కుట్రకు మనువాదులు పూను కొన్నారు...!
దేశంలోని ఏ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిన ఎర్ర జెండా పట్టుకొని రోడ్లను దిగ్బంధనం చేసే కమ్యూనిస్టు పార్టీ ల ప్రభను తగ్గించడంలో మతతత్వ వాదులు, పార్టీలు విజయవంతం అయ్యారని చెప్పాల్సి రావడం చాలా బాధాకరం...!
నిజంగా చెప్పాలంటే కమ్యూనిజాన్ని అనుసరిస్తున్న కమ్యూనిస్టుపార్టీలన్ని మనువు వారసుల నుండి పుట్టినవే కాబట్టి వారి నుండి సమాజం లౌకికవాద అభివృద్ధిని కోరుకోవడం తప్పే అవుతుంది...!
సిపిఐ నిర్మాత ఢాంగే నుండి మొదలుకొని సిపిఐ మావోయిస్టు నేత చారు మంజుందార్ వరకు అందరు బ్రాహ్మణ కమ్యూనిస్టులు వాళ్ళు మను ధర్మాన్ని తూ.చా తప్పకుండా పాటించే విధంగానే కార్యక్రమాలు కనబడుతున్నాయి..!
సుమారు 90 సంవత్సరాల కాలంలో ఈ దేశాన్ని మెజార్టీ కులాలను అధికారంలోకి తీసుకు రావడంలో కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు విజయవంతం కాలేదు.....!
మీరు చెప్తున్న సిద్ధాంతం అన్నా తప్పు గా ఉండాలి లేదా ప్రజలకు మీ సిద్ధాంతం అర్థం కాకుండా అయినా ఉండాలి...!
కాకపోతే సుమారు 90 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్టు ఉద్యమంలో చెప్పుకోతగ్గ ప్రజా యుద్ధం తెలంగాణ, సాయుధ రైతాంగ పోరాటం.
ఆ పోరాటాలన్నీ కూడా అగ్రవర్ణ కమ్యూనిస్టులు మనువాద బ్రహ్మణీయ పార్టీలైన కాంగ్రెస్ బిజెపి పార్టీలొనే కాక ఇతర పార్టీలో చేరి కార్మిక వర్గాన్ని మోసం చేశాయి...!
కమ్యూనిస్టు పార్టీలో ఈ దేశాన్ని పట్టిపీడిస్తున్న కులవివక్ష పై దీర్ఘకాలిక పోరాటాలకు కార్యాచరణ లేనే లేదు. బాబాసాహెబ్ అంబెడ్కర్ ఆయన ఆలోచన కు కమ్యూనిస్టు పార్టీలు స్థానం కల్పించక పోవడం మూలంగానే ఈ నష్టం జరిగినట్లు భావించాల్సిందే...!
ప్రపంచ గమనాన్ని మార్చడం కోసం త్యాగం చేసిన గౌతమ బుద్ధుడు, అంబేద్కర్,ములవాసి తత్వవేత్తల మార్గాన్ని, తత్వాన్ని, గమ్యం, గమనాన్ని, కమ్యూనిస్టు నేతలు, కార్యకర్తలు గుర్తించకపోవడం వల్ల ఈ నష్టం జరిగింది....!
కుల నిర్మూలన పోరాటాలు చేయాలని అప్పుడే ఈ దేశంలోని సమస్యలు పరిష్కారమవుతాయని అందుకోసం కార్యాచరణ మొదలుపెట్టిన మారోజు వీరన్నను మనువాదులు పనికట్టుకొని చంపివేశారు.
అయినప్పటికీ మరోజు వీరన్న వేసిన సామాజిక ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బిజెపి పాత్ర లేదు. అది అప్పుడు పుట్టలేదు. ఆనాటి నిజాం రాజ్యంలోని ఆర్య సమాజ్, హిందూ మహా సభ, ఆర్ఎస్ఎస్ కూడా సాయుధ పోరాటంలో పాల్గొన లేదు. ఒకవైపు హైదరాబాదు నగరంలో నిజాం వ్యతిరేకతను చూపిస్తూనే, మరోవైపు తెలంగాణ గ్రామాలలో భూస్వాములు, దేశ్ ముఖ్ లను అవి బలపర్చాయి. దొరల ఆగడాలకు అవి వత్తాసు పలికాయి. వాటి పునాదుల మీద లేచిన ఇప్పటి బిజెపి దేశ సంపదను కొంతమంది పెట్టుబడిదారులకు అప్పగిస్తూ, నయా భూస్వామ్య వ్యవస్థను నిర్మిస్తున్నది. అలాంటి బిజెపిని కమ్యూనిస్టు పార్టీలు ఎదిరించడంలో విఫలమయ్యాయి. తమ ఘనమైన పోరాట చరిత్ర ను చెప్పుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. చరిత్రను తోడేళ్లకు అప్పగించి, తాము మాత్రం కలుగుల్లో దాక్కుంటున్నాయి. ఇది విచారకరం...!
బండిమొగిలి,
న్యాయవాది,
9989602566.

Comments
Post a Comment