Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

తెలంగాణ రాష్ట్రంలో లో అన్ని రాజకీయ పార్టీలు దళితుల చుట్టూ తిరుగుతున్నాయి...!

 



తెలంగాణ రాష్ట్రంలో లో అన్ని రాజకీయ పార్టీలు దళితుల చుట్టూ తిరుగుతున్నాయి...!
   '''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
 కారణాలు ఏమిటి....?
       ******************************
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత బంధు పథకాన్ని ప్రకటించి హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని దళిత నేతలను ఊరికి ఇద్దరు చొప్పున ప్రగతి భవన్ కు పిలిచి అందరితో సమావేశమై దళితబందు పథకానికి రూపకల్పన చేశారు..!
     తర్వాత నల్లగొండ జిల్లా వాసాలమర్రిలో 74 కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు డిపాజిట్  చేశారు.
  ఆ తర్వాత ఆగస్టు 15న హుజరాబాద్ నియోజకవర్గం లోని శాలపల్లి దగ్గర దళిత బంధు పథకాన్ని ప్రకటించడం కోసం పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
 ఆ సభలో 15 మంది లబ్ధిదారులకు పత్రాలను అందజేసి ఆ పథకానికి శ్రీకారం చుట్టారు.
 కాగా మొదట దళిత బందు పథకాన్ని ప్రకటించగానే ప్రతిపక్షాలు దళిత బందుకు డబ్బులు ఎక్కడ ఉన్నాయని,ఇప్పటికే  ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని విమర్శలు చేశారు.
 అందులో భాగంగానే కోకాపేట లోగల ప్రభుత్వ భూములను అమ్మిగా  వచ్చిన డబ్బుతో ప్రభుత్వాన్ని ఆర్దిక పరిస్థితి నుండి గట్టెంక్కించారని ప్రతిపక్షాలు ఆందోళన చేశారు.
   తెలంగాణ రాష్ట్ర సమితి 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, ఇవ్వలేదని రాష్ట్రంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేకపోయింది.
    కానీ తెలంగాణలో ఏర్పడిన నూతన పారిశ్రామిక అభివృద్ధి కోసం వేల ఎకరాల భూమిని పారిశ్రామికవేత్తలకు అప్పగించిన ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడానికి మాత్రం మనస్సు రాలేదు.
   పైగా ఎకరం  భూమి ఉన్న రైతుకు రెండు ఎకరాల భూమి కొని ఇస్తానని, రెండున్నర ఎకరాలు ఉన్న రైతుకు అర ఎకరం భూమి కొని ఇస్తామని, అంతిమంగా ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఉండాలని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.
  దానికోసం బడ్జెట్లో ఒక వెయ్యి కోట్ల రూపాయల నిధులను కేటాయించి ఒక్క రూపాయి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు.
   కానీ కొన్ని వందల ఎకరాల భూమి ఒక వైపు పారిశ్రామికవేత్తలకు ఇవ్వటమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వం హుజరాబాద్ లో  గెలవాలని రాష్ట్ర బడ్జెట్ మొత్తం వివిధ పథకాల పేరిట విపరీ తమైన ప్రభుత్వ సొమ్మును అప్పనంగా ఖర్చు చేస్తూ దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నామని ప్రచారం చేసుకొంటుంది.
 అంతేకాకుండా బీసీలకు ఎస్టీలకు వికలాంగులు కూడా ఆర్థిక సహకారం అందిస్తామని ప్రకటనలు ఇస్తూ హుజరాబాద్ లో ముందుకు పోతున్నారు.
 మండలానికి 500 కోట్ల రూపాయలతో ప్రణాళికను తయారు చేసి లబ్ధిదారుల వ్యక్తిగత ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేసి దళిత ప్రజలకు ఒక నమ్మకం అయితే కల్పించారు.
   అయితే లబ్ధిదారులు వారు ఎంచుకున్న పథకానికి సంబంధించిన కొటేషను సంబంధిత అధికారులకు అందించిన తర్వాత బ్యాంకు అధికారులు గ్రౌండ్ చేయవలసి ఉంటుంది.ఈకార్యక్రమంహుజరాబాద్ లోఎన్నికల ముందు  గనుక 
  గ్రౌండ్ అయితే హుజరాబాద్ నియోజకవర్గం లో 20 వేల కుటుంబాలకు లబ్ధి జరుగుతుంది.
   ఒకవేళ హుజరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పే పరిస్థితి లేదు.
    ఇది ఇలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం ప్రకటించగానే కాంగ్రెస్ పార్టీ, బిజెపి పార్టీలు, ఈ పథకం అమలు సాధ్యం కాదని ఒక హుజురాబాద్ లోనే కాదు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ఇవ్వాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు, అంతేకాకుండా తెలంగాణలోని బిసిలకు, ఎస్టిలకు ఇతర పేద వర్గాలకు ఆర్ధిక సహాయం అంది ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెసు బిజెపి వైఎస్సార్సీపీ పోటాపోటీగా బహిరంగ సభలో పెడుతూ అందరినోట మొత్తానికి *జై భీమ్* పలుకులు పలుకుతూ ముందుకెళుతున్నారు
     ******************************
                                              బండిమొగిలి,
                                               న్యాయవాది,
                                             9989602566.


Comments