Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

మా విలువ నాడు యాభై.......! నేడు....! 10 లక్షలు...!

 


మా విలువ నాడు యాభై.......! నేడు....! 10 లక్షలు...!
      ******************************
 దళితులు ఎంత అభివృద్ధి చెందారో...?
  """"""""""""""""""""""""""""""""""
   దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి  నుండి నేటి వరకు దళిత ప్రజలను పాలక పక్షాలు, ప్రతిపక్ష పార్టీలు మోసం చేస్తూ అధికారం చెలాయిస్తున్నరు. దేశానికి ఎన్నికలు మొదలైన నాడు సారా  తిత్తి తో మా ఓట్లను కొనుగోలుకు తెరలేపిన రాజకీయ పార్టీలు నేడు మా ఓటు విలువ ఏకంగా10 లక్షలు ఇచ్చి దళితుల ఓట్లు వేసుకొని అధికారంలోకి రావడానికి పథక రచన చేశారు   రాజ్యాంగ నిర్మాత  బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ పుణ్యమా అని కొన్ని ఉద్యోగాలు పొందిన సమాజం కొంత మేరకు అభివృద్ధి అయ్యారు.
  కానీ అంబేద్కర్ ఆశించిన విధంగా ఎదిగిన  ఆ వర్గాలు కూడా అగ్రవర్ణాలకు, పాలక పక్షాలకే కొమ్ము కాశారు ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయని చెప్తున్న ప్రభుత్వాలు వారి జీవితాల్లో వెలుగులు ఎందుకు రాలేదో చెప్పవలసి ఉంది.
  ఈ దేశం అభివృద్ధి కోసం పంచవర్ష ప్రణాళికల తో మొదలైన బడ్జెట్ ఇప్పటివరకు దళిత వర్గాలను అభివృద్ధిని చేయలేకపోయాయి.
   కాబట్టి ఇప్పటికే అన్ని పార్టీలు ఎస్సీ ఎస్టీ లకు అసంపూర్ణ పథకాలకు రూపకల్పన చేసి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని తర్వాత వారిని పట్టించుకున్న పాపాన పోలేదు.
   అంతేకాకుండా ప్రతి ఎన్నికల్లో దళితులే అన్ని  పార్టీల జెండాలు మోసే విధంగా ప్రణాళిక రచించి వారిని ఓట్లు వేసే యంత్రాలుగా మార్చి వేశారు. 
 ఇందుకు
  ఈ వర్గాల నుండి కొంతమందిని నియమించుకుని ఎస్సీ ఎస్టీ ఓట్లతోనే ఈ దేశ పాలన జరుగుతుంది.
 చదువుకున్న ఎస్సీలకు ఉద్యోగాలు ఇవ్వమని అడిగిన ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం  ఎస్సీ ల పేరిట ఒక్క  హుజురాబాద్ లోనే రెండు వేల కోట్ల రూపాయలను అధికారికంగా పంచి దుర్వినియోగం చేయడానికి పూనుకున్నా ప్రభుత్వాలు ఈ డబ్బుతో ఉద్యోగాలుగాని, ఉపాధిగాని, ఇవ్వడానికి మాత్రం మనస్సు రావడం లేదు.
   అంతే కాకుండా దళితులను తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుండి నేటి వరకు పాలకులు మోసం చేస్తూనే ఉన్నారు.
    గోసి, గొంగడి, డప్పు,పట్టి తెలంగాణ గీతాలు రాసి, పాడి తెలంగాణ ఉద్యమాన్ని గ్రామాల్లో పటిష్టం చేసిన దళిత జాతి కవులు కళాకారులు ఉద్యమ తెలంగాణలో మోసానికి గురి అయ్యారు.
   తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని  చెప్పిన ఉద్యమ రథసారథి కె.చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత తానే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుండి నేటి వరకు మోసం చేస్తూనే ఉన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నా దగ్గరి నుండి ఇప్పటి వరకు అన్నిటిలో మోసమే చేశారు.
ఎస్సీ లకు మూడు ఎకరాల భూమి ఇవ్వడానికి కేసీఆర్ కు చేతులు రావు కానీ ప్రైవేటు పెట్టుబడిదారులకు వేల ఎకరాల భూమిని, పారిశ్రామికవేత్తలకు భూమిని స్వాధీనం చేసిన చరిత్ర కళ్ళముందు కనబడుతూనే ఉంది.
   అంతే కాకుండా గతంలో పనిచేసిన ప్రభుత్వాలు దేవాలయ భూములు అసైన్డ్ భూములు ఇనాం భూములన్నింటిని పట్టా లేదనే  పేరిట పట్టాలు ఇవ్వకుండా ఈ భూముల్లో రైతు వేదికలు, డంపింగ్ యార్డ్లు, తదితర అవసరాల కోసం దళితుల భూములు లాక్కున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది.
   అంతే కాదు తెలంగాణ ప్రాంతంలో దేవాలయ భూముల పేరిట సుమారు ఇరవై ఆరు వందల ఎకరాల భూమిని దేవుళ్ళ పేరిట పట్టా చేయాలని ఉత్తర్వులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం దళితులకు అసైన్ లాండ్ ఇనాం భూములకు మాత్రం ఇప్పటి వరకు పట్టాలివ్వకుండా దొంగచాటుగా  భూములను లాకొంటున్న తెలంగాణ ప్రభుత్వ కుట్రను   తెలంగాణ ప్రభుత్వం ప్రజలు గమనించాలి.
     ******************************

                                               బండిమొగిలి,
                                                న్యాయవాది,
                                             9989602566.



Comments

Post a Comment