Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

మెజార్టీ ఓటర్లు ఉన్నా రాజ్యాధికారం మాటెత్తని బీసీలు...!

 


మెజార్టీ ఓటర్లు ఉన్నా రాజ్యాధికారం మాటెత్తని బీసీలు...!

       ****************************** 

    బీసీ బంద్ కావాలని   నోరు చించుకొని మొరిగే బీసీలు.... ఎస్సీ లకు సబ్ ప్లాన్  సాదించుకుంటే...!

 మాకు బీసీ సబ్ ప్లాన్ కావాలని ఆందోళన చేశారు.....! ప్రభుత్వం చేసిందా...లేదు...!

      ******************************

 ఐనా వారికి రక్తం మరుగదు...!

 అడగడమే కానీ ఆతర్వాత పక్కాగా అమ్ముడుపోయి  హక్కులు కోల్పోతున్నా బీసీలకు ఎన్నాడస్తది.. సోయి...!

 1, బీసీ లకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలి...!

2, బీసీల జనాభా కు సరిపడా బడ్జెట్ ను కేంద్ర , రాష్ట్ర, ప్రభుత్వాలు కేటాయించాలి...!

3, బీసీలకు జనాభా ప్రాతిపాదికన హక్కులు కల్పించాలి...!

4, బీసీలకు టికెట్లు ఇవ్వాలి, న్యాయం చేయాలి...?

5, బీసీలకు ప్రత్యేక హాస్టళ్లనెలకొల్పాలి...!

6, బీసీలకు పీజరియంబర్స్ నిధులు వెంటనే విడుదల చేయాలి...! 

7, బీసీలకు భూములు కేటాయించాలి...?

8, బీసీ యువతకు ఇది కావాలి అది కావాలి అని....!

9, బీసీలకు ఎమ్మెల్సీలు అవకాశం కల్పించాలి...!

10, 60 శాతం ఉన్న బీసీల పైన 1/2 ఉన్నోళ్ల పెత్తనమేమిటి...?

ఇలా ప్రశ్నల వర్షం 

   బీసీల తరుపున పోరాటం చేస్తున్నా నేతలు గత 74 సంవత్సరాల నుండి ఇస్తున్న "స్లొగన్స్"......! నినాదాలు....!

   మరి....! ఎందుకు పై డిమాండ్స్ సాదించుకోలేక పోతున్నాం అనే ప్రశ్న ...? ఎప్పుడైనా వేసుకొన్నారా...? 

 పై సమస్యల పరిష్కారం కోసం ఏమైనా ఆలోచన చేశారా...? 

 అంటే లేదనే చెప్పాలి...!

  ఎందుకంటే....?

బీసీ లంత శ్రమ చేసే బానిసలు...! వారు ఇతర వర్గాలకు సేవచేసి  బ్రతకాలనే ఆలోచన తప్పా  మరో ఆలోచన లేదనిపిస్తుంది...!

  రాజకీయ అధికారం బీసీ ల చేతిలో ఉంటే పై సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలిసినా వారు ఆర్గనైజ్ కారు...!

 మరి...! బీసీల సమస్యలు అగ్రవర్ణ పాలకులు పరిష్కారం చేస్తే అగ్రవర్ణాల కు సేవలు ఎవ్వరు చేయాలి..? ఐనా ఎప్పుడూ బీసీలను మోసం చేసి అధికారం లో ఉండాలనుకునే అగ్రవర్ణ పార్టీలతో ఉండటం ఎందుకు...!  సమస్యల పరిష్కారానికి గోడవేందుకు...!

 బీసీల కోసం  కొంతమంది నేతలు  తెలంగాణను బేస్ గా చేసుకొని రాజకీయ ఉద్యమాలు చేస్తున్నారు...!

కానీ...!

 అసెంబ్లీ, పార్లమెంట్, ఎన్నికలు, వచ్చేవరకు ఆర్గనైజ్ ఐనా బీసీలు ఏటేళ్లుచున్నారు... ఎవరికి ఓట్లు వేస్తున్నారు...? 

 ఏప్పుడైనా ఆత్మపరిశీలన  చేసుకొన్నారా...?

 బీసీలను బాగుజేద్దామని  రాజకీయ పార్టీలు పెట్టిన జీవిఆర్ నారగోని, దేవేందర్ గౌడ్, ప్రభంజన్ కుమార్ యాదవ్, ఇంకా ఎంతో మంది బీసీలకు రాజకీయ అధికారంతో సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించారు....!

కానీ... బీసీలు రక్తబందువులను అన్ని రకాలుగా మోసం చేసి అగ్రవర్ణాల పంచన చేరి  అనాదిగా మోసానికి గురౌతున్నారు...!

   ఎస్సీ, ఎస్టి, లకు రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు, ఐ ఐ టి, నీట్ లాంటి సంస్థల్లో  అవకాశాలు వచ్చినప్పుడల్లా బీసీ గొంతుకలో నిరసన గళం వినిపిస్తేనే, వుంటుంది...!  

 బీసీలకు అధికారన్నీ చేతిలోకి తీసుకోవాలన్నా ధ్యాస ఎప్పుడొస్తుందో....? మరి...!

  ఎన్నికలు రాగానే సీజన్ వ్యాపారాలు చేసినట్లు బీసీ నేతలు అగ్రవర్ణ పార్టీల దగ్గరికి వెళ్లి  మాకు టిక్కెట్లు ఇవ్వండని పొర్లు దండాలు పెడుతరు...! 

  వాళ్ళు వేసే ఎంగిలికోసం లైన్లు కడతరు...! 

ఈ మాట బీసీనేతలకు ఇబ్బంది కలిగించవచ్చు...! కానీ 52 శాతం జనాభా కలిగిన బీసీలు ఆనాడు, ఈనాడు వారికంటూ ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవాలనే స్పృహ లేదు...! 

   బీసీలకు రాజ్యధికారం రాకుండా ఈ దేశంలో సమస్యలు పరిష్కారం కావని కాన్షిరాం ఏనాడో అన్నాడు...! 

   జనాభా ప్రాతి పాదికన అధికారాన్ని పంచడం కోసం కాన్షిరాం బి. ఎస్. పి ని పెట్టి రమ్మంటే  బి. ఎస్. పి పార్టీని అంటరాని పార్టీగా చూస్తున్న బీసీలను ఎవరు బాగుపర్చాలి...?

   పైగా దళితులకు ప్రభుత్వాలు ఏదైనా పథకం పెడితే అన్ని దళితులకేనా...! మాకు ఇవ్వరా... అని ఇదో ఏడుపు....!

    బీసీ మిత్రులారా... ఆలోచన చేయండి...! మీరు మారండి... రాజ్యధికారం కోసం కదలండి....!

                                                 జైభీంలతో,

                                             బండిమొగిలి,

                                              న్యాయవాది,

                                            9989602566.



Comments

Post a Comment