Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

మొన్న రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నష్టాల్లో ఉందని కోకాపేట భూములు అమ్మిన కేసీఆర్...!

 మొన్న రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నష్టాల్లో ఉందని కోకాపేట భూములు అమ్మిన కేసీఆర్...!

  నేడు తెలంగాణ రాష్ట్రం సుస్థిర మైన ఆర్థికాభివృద్ధితో సుసంపన్నా రాష్ట్రంగా అవతరించిందని కేసీఆర్ అంటున్నారు...!

******************************

   మరి ఏది నిజం...?

******************************

   ప్రతీ ఎన్నికల్లో ప్రభుత్వ డబ్బు వివిధ పథకాల పేరుతో ప్రజలకు పలారం లాగా పంచి అధికారంలోకి వస్తున్నా కేసీఆర్...!

  ఉద్యమ తెలంగాణలోని పోస్ట్ గ్రాడ్యుయేషన్, చేసి ఉద్యోగం లేక ఏమిచేయలో తోచక ప్రభుత్వం వేస్తాన్నాన్న నోటిఫికేషన్స్  వేయక పోవడం వల్ల  ఇప్పటికే కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొన్నారు...!

  విద్యార్థిని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొంటే ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీ నేతలు, మృతిచెందిన  వ్యక్తి శవాన్ని ప్రచారం కోసం వాడుకొని వొదిలేస్తున్నారే కానీ ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఏమిటన్నది ఇప్పటికి... ప్రశ్నగానే మిగిలింది...!

    చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇవ్వని ఉద్యమ తెలంగాణలో గోర్లు, బర్లు, ఇచ్చి ఓహో...మస్తు అభివృద్ధి చేశామని గొప్పలుచెప్పుకోవడమే తెలంగాణ ప్రజలకు మిగిలింది...!

   2019 ఎన్నికల్లో బీసీలకు బ్యాంకుతో సంబంధం లేకుండా రుణాలు ఇస్తామన్న కేసీఆర్ 11,00 మంది బీసీ లబ్ధ్దిదారులకు 50 వేల రూపాయల చెక్కులు ఇచ్చి ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు....! బీసీల పథకం ఎప్పుడెక్కడుందో  కేసీఆర్ చెప్పాలి ....!

  ఇప్పుడు దళితబందు అని హుజరాబాద్ ఎన్నిక కోసం  15 మంది దళితులకు 10లక్షల చొప్పున ఇచ్చారు...!

  2019 లో బీసీ బందు,ఇప్పుడు దళిత బందు, ఇచ్చి ఓట్లు వేసుకొని ప్రజలను గాలికొదిలెయ్యడం ఖాయం....!

                                          బండి మొగిలి,

                                           న్యాయవాది,

                                        9989602566.



Comments