Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

గదిలో చీకటి ఉంటే ఎంత ప్రార్దన చేసినా వెలుగురాదు....!


 గదిలో చీకటి ఉంటే ఎంత ప్రార్దన చేసినా వెలుగురాదు....!

       వెలుతురు కోసం లైట్ వేసుకోవాల్సిందే....!

     ******************************

అందవిశ్వసాలుంటే వొదులకోవాల్సిందే...! అసమానతలుంటే నేల మట్టం చేయాల్సిందే...!

  నిచ్చెనమెట్ల వ్యవస్థను విరగొట్టాల్సిందే....! రాజ్యాంగ స్పూర్తితో ముందుకు కదాలాల్సిందే...!

    చీకటిని ఛేదించాలంటే లైట్ వెలుగులోకి వెళ్లాల్సిందే...!

   మూర్ఖత్వం ప్రపంచంలోని అన్ని మతాల్లో ఉంది...! 

 ఎవరైనా మతం గురించి, కులం, గురించి మాట్లాడుతున్నారంటే ..! వారి మానసిక స్థితి సరిగా లేదనుకోవాలి...!

ఎందుకంటే...? 

    మతాన్ని పాటించే వ్యక్తి నుండి ఎలాంటి హేతుబద్ధమైన ఆలోచనను ఆశించలేం...?

     వాళ్ళు నీటిలో తేలుతూ అటు-ఇటు ఊగే మొద్దులాంటి వాళ్ళు...!

  

   మతాలను శాశించే సాహసం చేయక పోతే...!

  చివరకు అవి మన స్వేచ్చా, స్వాతంత్రాలను హరించివేస్తాయి..!

 నిచ్చెనమెట్ల, సంస్కృతిని  మనుస్మృతిని మళ్ళీ బలోపేతం చేయాలని  అధికారంలో ఉన్నా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి...! 

  కానీ....?

 ఈ దేశంలోని వివేకవంతులు, ఆ ప్రయత్నాలను సాగనివ్వరు...! ఎందుకంటే...?

  ఆధర్మ శాస్త్రాలు చెప్పింది అగ్రకులస్థుల, పట్ల నిమ్న కులస్తులవారు విధేయులుగా ఉండాలని, బానిసత్వం తో ఉండాలని కోరుకుంటారు...!

   ఈ సమాజంలో ఇది సాధ్యం కాదు.

 ఎందుకంటే...?

   ఈ దేశం ప్రజాస్వామ్య దేశం కావడం వల్లనే...!

 మతమంటే మరణం తర్వాత జరిగే ఒక స్కామ్...!

కాబట్టి...!

మతం పేరిట నిలబడుతున్న దేవుడు, స్వర్గం, నరకం, పుణ్యం, పాపం, మోక్షo, కర్మ, తలరాత, విదిరాత, అన్ని గుడ్డినమ్మకాలే...!

 అందుకే...

  ప్రశ్నించడం అంటే మతానికి నచ్చదు...! వారి దగ్గర జవాబులు ఉండవు...! కాబట్టి ప్రశ్నలు ఎదుర్కోవడమంటే మతానికి (మతాన్నిఅనుసరించే వారికి) చిరాకు....!

            💐💐💐💐💐💐💐💐💐

                                               జైభీములతో,

                                              బండి మొగిలి,

                                                న్యాయవాది,

                                              9989602566.





Comments

Post a Comment