Search This Blog
Nava Tarangalu (translated as “New Waves”) is a widely circulated Telugu-language daily newspaper published in the Indian state of Telangana District Warangal, Hanamkonda Owned by BANOTH VIJAYKUMAR. Launched on 2021, the publication serves as a voice for regional and public issues.
త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు
- Get link
- X
- Other Apps
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 సంవత్సరాలు ముగిసింది....!
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 సంవత్సరాలు ముగిసింది....!
******************************
75 వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం.....!
""""""""""""""""""""""""""""""""""""""""""""""
అంటరానితనంతో వారి జీవితాల్లో మార్పు రాకపోవడానికి కారణం ఎవరు...?
74 సంవత్సరాల తర్వాత కూడా దళిత బహుజనుల పై ఎందుకు హత్యలు, అత్యాచారాలు,ఎందుకు కొనసాగుతున్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఒక్కసారి మేధోమదనం చేసుకోవాలి....!
74 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత కూడా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు భూమి ఎందుకు లేదు...?
అణగారిన వర్గాలను పనిగట్టుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు అభివృద్ధికి దూరం చేస్తారు...!అభివృద్ధికి నోచుకోని పథకాలకు రచనలు చేస్తూ అణగారిన వర్గాలను పాలనకు ఇంకా ఎంతకాలం దూరం చేస్తారు...!
దళిత బహుజనులు ఇంకా ఎన్ని సంవత్సరాలు భరించాలో మననం చేసుకోవాల్సిన అవసరం ఉందా...? లేదా...? ఆలోచన చేయండి....!
74 సంవత్సరాల తర్వాత కూడా ప్రతి విషయంలో అభద్రతా భావం, అమ్మాయిలపై అఘాయిత్యాలు, అన్యాయంపై ప్రశ్నిస్తే హత్య చేయడం ఇంకా ఎన్నాళ్లు....!
74 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా కుల అసమానతలు, ప్రేమిస్తే చంపి వేయడం, ఓట్లను డబ్బులకు కొని అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత సమాజ ఉత్పత్తిని దోపిడీ చేసి ప్రజలకు కనీస అవసరాలు కల్పించకుండా మోసం చేస్తున్న పాలకులను ప్రశ్నించాలి....!
ప్రభుత్వ సంస్థలు, వైద్యశాలలను ప్రైవేట్ పరం చేసి, ప్రకృతి విరుద్ధంగా జరిగే అనేక సంఘటనలు సామాన్య ప్రజలు ఇంకా ఎంత కాలం అనుభవించాలో మెజార్టీ కులాల ఓటర్లు ఆలోచన చేయాలి...??
లేక...?
ఇంకో వంద సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవిస్తారా..! తేల్చుకోండి...!
జైభీంలతో,
బండి మొగిలి,
న్యాయవాది,
9989602566.
- Get link
- X
- Other Apps
Popular Posts
పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచితే సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏమిటి
- Get link
- X
- Other Apps



Comments
Post a Comment