Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

పీజు రియంబర్స్ పథకం బీసీల బాగుకోసం కానే కాదు...!


పీజు రియంబర్స్ పథకం బీసీల బాగుకోసం కానే కాదు...!

    అగ్రవర్ణ కులాల అభివృద్ధి కోసమే ఈ పథకాన్ని సృష్టించారు...!

***********************************

తెలంగాణ ప్రభుత్వం బీసీ విద్యార్థుల కోసం ప్రవేశ పెట్టిన రీయింబర్స్ మెంట్ పథకం అగ్రవర్ణ, దోపిడీ కులాలకు వరంగా మారింది...!

    ప్రభుత్వ రూపాయలు దర్జాగా ప్రైవేటు కళాశాలకు తరలిపోతున్నా పౌరసమాజం పట్టించుకోదు.....!

   వాస్తవంగా బీసీ రీ ఎంబర్స్ మెంట్ క్రింద ప్రైవేటు కళాశాల యాజమాన్యాలకు యేటా 2 వేలకోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు...!

    ఈ 2 వేలకోట్ల రూపాయల బడ్జెటుతో బీసీ విద్యార్థులకొసం .......10,నుండి15 యూనివర్సిటీలు ఏర్పాటు చేయవచ్చు....!

    కొత్తగా ఏర్పాటు చేసే యూనివర్సిటీల వల్ల  విద్యార్థులకు కొత్త కోర్సుల్లో అవకాశాలు రావడంతో పాటు బీసీ పిల్లలకు  ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా దొరికే అవకాశం ఉందన్న మాట వాస్తవం....!

   వాస్తవానికి బీసీ పీజు రీ ఎంబర్స్ మెంట్ పథకాన్ని ప్రభుత్వం... ప్రైవేటు విద్యా సంస్థల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన విషయం బీసీ సమాజం తెలుసుకోవడం లేదు...!

   బీసీలకు ప్రభుత్వం ఫీజు కడుతుందనగానే కోళ్లపారాలు కుడా విద్యాసంస్థలు గా మారిపోయాయి....!

    బీసీలకు ఉన్నత విద్యను అందిస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం కళాశాలలకు సరైన సమయంలో ఫీజులు విడుదల చేయకపోవడం వల్ల కళాశాల యాజమాన్యం పిల్లలకు సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడం వల్ల బీసీ విద్యార్థులు ఉన్నతవిద్య అవకాశాలు కోల్పోయి తీవ్రమైన మానసిక క్షోభ అనుభవిస్తన్నారు...!

   బీసీ విద్యార్థి లోకం ఇప్పటికైనా ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ద్వారా ప్రైవేటు కళాశాల కు చెల్లించే కోట్లాది రూపాయలను ప్రభుత్వ నేతృత్వంలో కొత్త యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని పోరాటాలు చేస్తే రానున్న బీసీ సమాజానికి మేలుజరుగుతుంది....!

( మిత్రులారా ఈ విషయం పై సుదీర్ఘంగా చర్చ చేయండి )
                                            జైభీములతో,
                                           బండి మొగిలి,
                                             న్యాయవాది,
                                          9989602566.


Comments

Post a Comment