Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

ప్రియమైన ఓటరు మహాశయులారా...!

 



ప్రియమైన ఓటరు మహాశయులారా...!   
 
    కేసీఆర్ కు ఎందుకు ఓటు వేయాలి...? 

    తెలంగాణ ప్రాంతంలో దళిత, బహుజన యువతీ యువకులను నిర్దాక్షిణ్యంగా నరికి చంపుతున్నందుకు ఓటు వేయలా....?

 హరిజన, గిరిజన, ప్రజలను మనుషులుగా చూడని ఈ పార్టీలకు మనం ఎందుకు ఓటు వేయాలి...? 
  అబంగపట్నం లో ఉరికి ఉపయోగపడే మొరాన్ని అక్రమంగా తరలిస్తున్న భారత్ రెడ్డి ని అడ్డుకున్న పాపానికి ఇద్దరు మాదిగ యువకులను మురికి నీటిలో ముంచి ముక్కును నేలకు రాకించి, హింసకు గురిచేస్తే తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు, మూడునెలల ప్రజాసంఘాలు ఆందోళన చేస్తే భారత్ రెడ్డి లోగిపోతే గాని పోలీసులు అరెస్టు చేయలేదు....
   చిన్నకందుకురులో సంక్రాంతి పండుగ కు మాంసం వండుకొని తిన్నారని బీజేపీ, భజరంగ్ దళ్, ఏబీవీపీ గుండాలు దాడి చేస్తే తెలంగాణ ప్రభుత్వం పట్టించుకుందా...? 

  కందికోటిక్కురు గ్రామంలో 30 గుంటలు భూమి కోసం ఇద్దరు మాదిగలను నరికి చంపిన తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదు...!

 మిర్యాలగూడలో ప్రణయ్ కులంపేర పట్టపగలు కిరాయి హంతకులతో చంపిస్తే కేసీఆర్, కెటీఆర్, హరీశ్ రావు కనీసం ఖండించారా...?
  ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు రాజ్యాధికారం లోకి వచ్చేవరకు ఈ చావులు తప్పవు...
  కాబట్టి మన ఓటు మనం వేసుకొని అగ్రవర్ణ పార్టీలను ఒడిద్దాం....! 
                                             జైభీములతో
                                           బండి మొగిలి,
      ABSF STATE Hon'ble PRESIDENT,
                                            ADVOCATE,
                                         9989602566.


Comments

Post a Comment