Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

ఈ దేశంలో ప్రేమించు కుంటే... చావనైనా చావాలి.. లేదా చంపైనా వేస్తారు....!

 




ఈ దేశంలో ప్రేమించు కుంటే... చావనైనా చావాలి.. లేదా చంపైనా వేస్తారు....! 

   ఎవరు ఏమి అనుకున్నా ఇదేనిజం...!

ఆ ఎందుకు ప్రేమించి పెండ్లి చేసుకున్న వారు బ్రతకడం లేదా అనేవారు కూడా ఉన్నారు...

   ఎందుకు లేరు కాకపోతే అత్తవారింటికి అల్లుడు పోడు...

    భర్త గారింటికి బార్యపోదు...! 

   ఇది భారతం..... ! 

        ఈ దేశాన్ని పాలిస్తున్న వారు  ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వడం లేదు...? 

   ప్రేమ అనేది ఒకే కులంలో పుట్టాలని ఉందా..! 

   పరాయి కులం అమ్మాయిని ప్రేమిస్తే ప్రిమించి నోడికి అన్నీ ఉన్నా కులం తక్కుఒడైతే ఖతం..! ఎదో ఒకటి జరగాలి...!


    చావడమా..! చంప బడటమా..!

ఈ మరణాలు హిందు మతంలోనే ఎక్కువ...!

 మరి ఈ ప్రేమ సమస్యకు పరిష్కారం ఏమిటి...? 

ఈ దేశం లో అన్ని మతాల వారు ఉండ వచ్చు కానీ ఒక మతం వారు మరో మతం వారిని మాత్రం పెళ్లి చేసుకోరాదు

   ప్రేమించి అస్సలు చేసుకోరాదు..!  

ఈ సమస్య కు పరిష్కారం ఎలా..! చదువుకున్న సమాజం ఆలోచించలి..! 

   చట్టం ప్రకారం Age ఉన్నా వారు పెళ్ళికి అర్హులైనప్పుడు చావులెందుకు జరుగుతున్నాయి..? 

   అంటే చట్టం ఈ దేశంలో అమలుతున్నట్లా..! లేదా..! కచ్చితంగా చట్టం అమలు కావడంలేదు...!

    ప్రతి రోజు పత్రికల్లో ప్రేమ జంట ఆత్మహత్య, ఉరిపెట్టుకొని, విషం త్రాగి,  రైలు కింద పడి, వివిద పద్దతుల్లో ప్రేమికులు చనిపోతుంటే ఈ ప్రభుత్వానికి పట్టదు..!        మరి ఈ సమస్య కు పరిష్కారం ఎలా..? ఆలోచించాలి..!


   ఎంతో భవిష్యత్ ఉన్న పిల్లలు పై ప్రేమ పేరిట జరుగుతున్న హత్యలు ఎలా అగుతాయి..! 

ఈ సమస్య కు పరిష్కారం ఎలాగో చర్చ చేయండి....!

                                           జైభీములతో,

                                           బండిమొగిలి,

                                            న్యాయవాది,

                                         9989602566.



Comments