Search This Blog
Nava Tarangalu (translated as “New Waves”) is a widely circulated Telugu-language daily newspaper published in the Indian state of Telangana District Warangal, Hanamkonda Owned by BANOTH VIJAYKUMAR. Launched on 2021, the publication serves as a voice for regional and public issues.
త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు
- Get link
- X
- Other Apps
కుటుంబమంతా మరణించినంక న్యాయం ఎవరికి జరుగుద్ది...!
కుటుంబమంతా మరణించినంక
న్యాయం ఎవరికి జరుగుద్ది...!
*కోర్టులో ఈ కేసు నిలబడుతుందా...?*
******************************
రెక్కాడితే గాని డొక్కాడని ఒక ఆటో డ్రైవర్ తనకు, తన కుటుంబానికి జరిగిన అవమానం భరించలేక చనిపోవాలని నిర్ణయించుకొని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకొన్నదంటే ఆకుటుంభం ఎంత ఒత్తిడికి గురైనదో అర్థమౌతుంది...!
తెల్లరితే జరిగే పరిణామాలను ఊహించుకొని
రాబోయే పరిణామాలను తలుచుకొని రాత్రంతా గుబులు,గుబులుగా గడిపిన భిక్షపతి తాను ఉంహించిదే జరిగే సరికి తట్టుకోలేక పోయిన భిక్షపతి ముందుగా భార్య,కన్న బిడ్డలను ఉరేసి తాను ఉరివేసుకొన్నా తర్వాత న్యాయం ఎవరికి జరుగుద్ది...!
కండబలం, అధికార బలం,తో పక్కింటి వారు, వారి వేధింపులు....!
తన కుటుంబంపై చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, వీటన్నిటికీ ఒక సామాన్యుడు ఎదుర్కోవడానికి వీలులేని పద్మవ్యూహంలో చిక్కుకున్న ఆటో డ్రైవర్ కుటుంబం తనువు చాలించాలని నిర్ణయం తీసుకున్నది....!
అంటే ఎదుటి వారి వేధింపులు వారు ఆరోపిస్తున్న ఆరోపణలు నిజమా.....! అబద్దమా...?
అని చర్చ చేసే పరిస్థితి లేని స్థితిలో ఇలాంటి సంఘటనకు పాల్పడ్డారని అనిపిస్తుంది...!
ఏదిఏమైనా ఆ కుటుంబం మొత్తం చనిపోవాలని నిర్ణయించుకుంది...!
అంటే ఆ కుటుంబం ఎంత క్షోభ అనుభవించిదో జరుగబోయే ఉపద్రవం గురించి ఎన్నిసార్ల ఆలోచించిందో ఆలోచిస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది....!
ఉదయం ఆటో తో బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే వరకు ఏ గొడవ చేస్తారనే అయోమయ స్థితిలో నిత్యం ఆ కుటుంబం కొట్టుమిట్టాడుతుంది...!
అంటే శుక్రవారం బయటికి వెళ్లి వచ్చిన బిక్షపతి పై పక్కింటి అమ్మాయి తల్లిదండ్రులు మూకుమ్మడి దాడి చేయడంతో కలత చెందిన కుటుంబ సభ్యులు చేసేదేమీలేక,నిస్సయా స్థితిలో దెబ్బలు,పెడబొబ్బలు,అహంకారాల మధ్య ఏమి జరుగుతుందో అర్థం కాని, స్థితిలోకి వల్లెపు బిక్షపతి కుటుంబం నెట్టివేయబడింది...!
ఒకసారి రెండుసార్లు కాదు అనేకసార్లు మానసిక హింసకు, గురైన ఆ ఆటోడ్రైవర్ ను సభ్యసమాజం అదుకోలేకపోయింది...! నిజంగా ఆటో డ్రైవర్ తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి శిక్షించాల్సిన రాజ్యం మిన్నకుండి పోవడంతో ప్రస్తుతం అభం,శుభం తెలియని ఇద్దరు పిల్లులు శవాలుగా మారిపోయిన పరిస్థితి. ఎంతో భవిష్యత్తును కలలు కన్న ఆ పసికునలు అర్దంతరంగా వారి ఆయుష్షు ఆగిపోవడానికి సమాజం కారణం కాదా...?
నేరం చేసి తప్పించుకు తిరుగుతున్న ఎంతోమందిని భరిస్తున్న ఈ సమాజం ఏ నేరం చేశాడని బిక్షపతి కుటుంబాన్ని బలి తీసుకున్నదో ఎవరు చెప్పాలి...!
చెప్తే నిజాలను వినడానికి ఎవరున్నారు...?
రాత్రి జరిగిన గొడవ ఏ స్థాయిలో ఉందో గమనించాల్సిన పోలీసులు సరైన విధంగా స్పందించక పోవడం వల్లనే ఈ అనర్థం జరిగింది...!
పోలీసులు గొడవకు దిగిన వారిని హెచ్చరించి ఉంటే ఉదయం తిరిగి గొడవ జరిగేది కాదు, కానీ పోలీసులు ఉదాసీన వైఖరితో ఆ కుటుంబం మృత్యువాత పడింది....!
ఉదయం 6 గంటల నుండి మొదలైన, అల్లరి,దూషణలు, పెడబొబ్బలు అమ్మాయి తరుపు బంధువుల మూకుమ్మడి దాడిని భరించలేని స్థితికి వెళ్ళింది....!
ఇక ఈ లోకం లో బ్రతకడం కష్టమని భావించి, నిర్ణయం తీసుకున్న బిక్షపతి. తన ఇద్దరు పిల్లలతో కలిసి అందరూ చూస్తూ ఉండగానే పక్కింటి వారి జులుంన్ని ఎదుర్కొనే ధైర్యం లేక, ధైర్యాన్ని ఇవ్వాల్సిన పోలీసులు నిమ్మకు ఉండిపోవడంతో ఇక చేసేది ఏమి లేక బిక్షపతి మా చావే ఈ సమస్యకు పరిష్కారమని, ఉద్రేక సమయంలో తీసుకున్న నిర్ణయం వల్ల బిక్షపతి కుటుంబం బలైపోయింది....!
అందరూ చూస్తుండగానే కుటుంబ సభ్యులు ఉరేసుకుని చనిపోయిన తర్వాత వచ్చిన పోలీసులు వారి శవాలను కిందకు దింపి మరణానికి కారకులైన వారిని రక్షించడం కోసం, వారు పురుగుల మందు తాగారని, పురుగుల మందు తాగడం వల్లనే చనిపోయారు అనే అనుమానం వ్యక్తం చేశారు...!
ఏది ఏమైనా భిక్షపతి,తన కుటుంబ సభ్యుల మరణం వల్ల జరిగే న్యాయం ఎవరికి ఓదార్పు నిస్తుంది....!
(హైదరాబాద్ లో జరిగిన యాదార్ధ సంఘటనకు స్పందనగా)
జై భీమ్ లతో ,
బండి మొగిలి,
న్యాయవాది ,
9989602566.
- Get link
- X
- Other Apps
Popular Posts
పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచితే సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏమిటి
- Get link
- X
- Other Apps



Comments
Post a Comment