Search This Blog
Nava Tarangalu (translated as “New Waves”) is a widely circulated Telugu-language daily newspaper published in the Indian state of Telangana District Warangal, Hanamkonda Owned by BANOTH VIJAYKUMAR. Launched on 2021, the publication serves as a voice for regional and public issues.
త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు
- Get link
- X
- Other Apps
అమెరికాలో దళితుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయాలని జో బైడెన్ డిమాండ్ చేస్తున్నాం.
అమెరికాలో దళితుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయాలని జో బైడెన్ డిమాండ్ చేస్తున్నాం.
....
మన దేశం నుండి విదేశాలకు వలస పోయిన వాళ్లు కుల భావజాలాన్ని కూడా మోసుకు పోతారు. తొందరగా కులాన్ని నిర్మూలించకపోతే, అది ప్రపంచ సమస్య అవుతుంది అన్న కేలూస్కర్ వ్యాఖ్యను బాబాసాహెబ్ అంబేద్కర్ సీరియస్‌గా పట్టించుకున్నాడు. అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా ఖండాలలో స్థిరపడిన అగ్రకులస్తులు ఎస్సీ, ఎస్టీ బిసీలను పీడిస్తున్నారు. పని చేసే చోట వివక్ష చూపిస్తున్నారు. ఇదిగో ఈ CISCO కంపెనీలో జరిగిన జరిగిన దురదృష్టకర అమానవీయ సంఘటన అందుకు సాక్ష్యం. ఈ కంపెనీలో పని చేసే వొక IIT గ్రాడ్యుయేట్ ని కులం పేరుతో వివక్ష చూపించాడొక బ్రాహ్మణ కులానికి చెందిన పై ఉద్యోగి. జాన్ డోయ్ రిజర్వేషన్ ద్వారా ఐఐటిలో చదువుకున్నాడు, మెరిట్ ద్వారా కాదని తోటి ఎంప్లాయీస్ కు చెప్పాడు. అప్పటి నుండి వొక పద్ధతి ప్రకారం ఆ దళిత ఉద్యోగిని అన్ని ప్రాజెక్టుల నుండి ఆ యిద్దరు సవర్ణ ఉద్యోగులు తప్పించేశారు. ఈ విషయం మీద ఆ దళిత ఉద్యోగి సదరు సిస్కో కంపెనీకి ఫిర్యాదు చేశాడు. వాళ్లు తనకు న్యాయం చేయలేదు. అతడు కోర్టులో కేసు వేశాడు. ఆ బ్రాహ్మణ ఉద్యోగికి మద్దతుగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన హిందూ అమెరికన్ ఫెడరేషన్ రంగంలోకి దిగింది. అమెరికా చట్టాలలో కుల వివక్ష నేరమని లేదు కాబట్టి, జాతి వివక్ష, వర్ణ వివక్ష మాత్రమే నేరం కాబట్టి ఆ దళితుడు జానో డోయ్ పెట్టిన కేసు కొట్టేయాలని వాదించింది. హిందూ మతంలో కులం లేదనీ, కుల వివక్ష, అంటరానితనం అనేవి హిందూ మతానికి సంబంధించినవి కావని వొకవైపు వాదిస్తూనే, మరోవైపు హిందూమత ఆచార వ్యవహారాలలో అమెరికా జోక్యం చేసుకోరాదని వాదిస్తుంది. అంటే హిందూ మతంలో కుల వివక్ష సహజం. దాని మీద చర్య తీసుకుంటే, హిందూ మతం మీద చర్య తీసుకున్నట్టే అనే పరోక్ష హెచ్చరిక అన్న మాట. ఈ కేసును ఫెడరల్ కోర్టులో విచారిస్తున్నారు. కేసు సెప్టెంబరులో హీయరింగ్ కు రానున్నది.
ఈ కేసు వల్ల మనకు అమెరికాలో కుల వివక్ష తీవ్రత అర్థం అవుతుంది. బ్రాహ్మణ, కమ్మ, వెలమ, రెడ్డి, ఠాకూర్, అయ్యర్ తదితర సవర్ణ కులాలు అమెరికా కంపెనీలలో ఉన్నత స్థానాలు ఆక్రమించాయి. వీళ్ల దయాదాక్షిణ్యాల మీద నల్లవాళ్ల జీవితాలు, ఇండియా నుండి మంచి భవిష్యత్తు కోరి వలస పోయిన ఎస్సీ ఎస్టీ బిసిల జీవితాలు విలవిల్లాడి పోతున్నాయి. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అడిగి ఉద్యోగాలివ్వరు. ఇచ్చినా కూడా అతి తక్కువ వేతనం ఇస్తారు. బండెడు పని చాకిరీ చేయిస్తారు. సోషల్ లైఫ్ లో వెలివేస్తారు. ఇక తెలుగు సంఘాల పేర, లేదా NRI సంఘాల పేర కులం కూటములు నిర్వహిస్తారు. ఈ కూటములలో దళితులకు గిరిజనులకు ప్రేక్షక పాత్ర తప్ప ఏ విలువా లేదు.
కులం నుండి బయట పడాలంటే ఈ దేశం విడిచి వేరే దేశం పోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ బహుజనుల కన్న ముందే అగ్రకులస్తులు వెళ్లి అక్కడ పెంట తయారు చేశారు. పైగా వీళ్లంతా అక్కడి ప్రభుత్వాల గెలుపు ఓటములను నిర్ణయించే ఓటర్లుగా వున్నారు. వీళ్లను మెప్పించడానికి గతంలో చాలామంది అమెరికన్ ప్రెసిడెంట్లు ఆరాటపడ్డారు. ఒబామాతో సహా. ఇప్పటి బైడెన్ కూడా.
ఇందుమూలంగా అర్థం కావలసిన సత్యం యేమనగా,
ఏదేశమేగినా
ఎందుకాలిడినా
పోరాడరా నీ విముక్తి కోసం - అని.
అమెరికాలో దళిత, బిసి, గిరిజనుల మీద జరుగుతున్న కుల వివక్షను అరికట్టే చట్టాలు చేయాలని ద్రవిడ బహుజన సమితి అమెరికా అధ్యక్షుడిని డిమాండ్ చేస్తున్నది. జాన్ డోయ్ ని అవమానించి, మానసిక వేదనకు గురిచేసిన ఇద్దరు సిస్కో ఎంప్లాయీస్ లకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తుంది. బాధితునికి DBS సంఘీభావం తెలుపుతుంది.
డా. జిలుకర శ్రీనివాస్
- Get link
- X
- Other Apps
Popular Posts
పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచితే సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏమిటి
- Get link
- X
- Other Apps




Comments
Post a Comment