Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

రూపాయి ఐనా రూపమైన శాశ్వతం కాదు...!

   
















అమ్మా రొమ్ము పాలు తాగి రక్తం పంచుకొని పుట్టిన అన్న, తమ్ములు మనవి కానీ మనతో రాని ఆస్తులు,ధనం కోసం కొట్టుకొని చస్తున్నారు...! 

   రూపాన్ని చూసుకొని కొంతమంది రూపాయలను చూసి కొంత మందిని దూరంచేసుకొని ప్రశాంతతకు దూరంగా ఉంటున్న మిమ్మల్లి ఎవరు మార్చాలి....! 

రూపాయి ఐనా రూపమైన  శాశ్వతం కాదు...! 

    స్నేహం ఎలాంటి వారితో చేస్తే అలాంటి అలవాట్లు వస్తాయి...! 

   మనిషి ఎదుటి వారిలా బ్రతకాలని ఎప్పుడయితే కోరుకొంటాడో అప్పుడే అప్పులపాలై అవస్థలు పడతాడు. 

   ఎంతో అల్లారు ముద్దుగా  పెంచుకొని ప్రేమతో చూసుకున్న  వారినే మోసం చేస్తున్న సమాజమిది ...! 

   ప్రాణం లేని వస్తువులకు ఇచ్చే వీలువ....! 

 కన్నా తల్లిదండ్రుల మీద వీలువ లేని  వ్యవస్థలో మనం ఉన్నాము....!

 బందం లేదు బంధుత్వం లేదు అవకాశం దొరికితే మనోడైనా, మందోడైన మోసం చేసుడే....! 

చిన్న కుటుంబం చింతల్లేని కుటుంబం అన్నారు కాని అన్నకు తమ్ముడు శత్రువు.... ! 

అక్కకు చెల్లె శత్రువు...! 

    లోకం మొత్తం మారిపోయి మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మరిపోయినవి...!

Comments