Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

బ్లాక్ ఇంక్ - ఆర్టికల్ రాజేందర్ దామెర

 



బ్లాక్ ఇంక్ - ఆర్టికల్

రాజేందర్ దామెర


*******


ఈటెల కథలో పరాజితులు ఎవరు..!?


*****


గత నెల రోజులకు పైగా  నడుస్తున్న "ఈటెల రాజేందర్" కథలో పరాజితులెవరు..? "ఈటెల" మెదడులో బహుజనవాదం బహుగానే ఉందని భజనలు చేసిన బహుజనులా..? బహుజనులు ఎనాటికైనా పావులుగానే ఉంటారని తనదారి తను వెతుకుంటున్న "ఈటెల" నా..? ఎవరు పరాజితులు..? ఈటెల రాజేందర్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇకడ

 "సూఫీ" కథ సందర్భోచితంగా ఉంటుంది. సూఫీ చెప్పిన కథ ఏమిటంటే.....

        "ఒక మనషి కష్టాలలో ఉన్నాడు. తన సమస్యలు తీరినట్లయితే, తన ఇల్లు అమ్మి ఆ సొమ్మునంతా బీదలకు పంచి పెడతానని ప్రమాణం చేశాడు. అతను తాను పెట్టుకున్న ఒట్టు చెల్లించవలసిన సమయం వచ్చిందని అర్థమయింది. కానీ అంత సొమ్ము అప్పనంగా పంచడానికి అతని మనసు ఒప్పలేదు. అతనందుకు ఒక మార్గం వెతికాడు. అతను తన ఇంటిని ఒక వెండి నాణానికి అమ్మకానికి పెట్టాడు. అయితే ఆ ఇంటితో కలిసి ఒక పిల్లిని కూడా కొనవలసి ఉంటుంది. పిల్లికి అతను పెట్టిన వెల పదివేల వెండి నాణాలు. మరో మనిషి ఇంటినీ, పిల్లినీ కొన్నాడు. మొదటి మనిషి ఒక వెండి నాణాన్ని బీదలకు ఇచ్చేశాడు. పదివేల నాణాలు జేబులో వేసుకున్నాడు. చాలామంది మెదళ్లు ఈ రకంగా పని చేస్తుంటాయి. వారు ఒక బోధనను అనుసరించాలని నిర్ణయించుకుంటారు. అయితే ఆ బోధనకు వారు తమకు తగిన విధంగా వ్యాఖ్యానం చేస్తారు. శిక్షణ కింద, వారు ఈ మనస్తత్వం నుంచి బయట పడితేగానీ , వారేమీ నేర్చుకోజాలరు". 

ఇది సూఫీ చెప్పిన కథ. సరిగ్గా ఇదే తరహాలో ఈటెల రాజేందర్ వ్యవహారం ఉందంటే కాదనగలమా..? ఆత్మగౌరవమన్నాడు. బహుజనుల ప్రతినిధిని అన్నాడు. లెఫ్ట్  ఆలోచనలతో రాజకీయ అవగాహణ ఉందన్నాడు.  బహుజనులూ భజనలు చేస్తూ భుజాన ఎత్తుకున్నారు. కానీ చివరికి ఈటెల అడుగులు ఎటుపడుతున్నాయి. ఈటెల చెప్పిన ఆత్మగౌరవ వాగ్థానాన్ని నిలబెట్టుకునే వైపే అడుగులేస్తున్నారా..? ఆస్తులను నిలకడగా ఉంచుకునెందుకు, బహుజనుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టే వైపు అడుగులు వేస్తున్నారా...? ఎటువైపు అడుగులు వేస్తున్నారనే ప్రశ్నకు "సూఫీ" కథ సారాంశం సరిగ్గా సరిపోతుందనడంలో సందేహం లేదు. ఈటెల వ్యవహారంలో బహుజనులు భుజానవేసుకొని బహుజవాదం అంటూ ఏదో ఊహించుకున్నారు. బహుజన నాయకత్వం బలపడుతుందని ఆశించారు. కానీ ఈటెలకు మాత్రం ఇవేమీ బుర్రకెక్కలేదు. వివిధ పార్టీల ప్రతినిధులతో ఈటెల చర్చలు జరిపారు. ఈటెలతో వివిధ పార్టీల ప్రతినిధులూ చర్చలు జరిపారు. ఈటెల ఎంచుకునే మార్గం సరైదికాదని బహుజన ప్రతినిధులు బహిరంగ లేఖ రాసి తమ ఆశలను, ఆవేదనను వెలిబుచ్చారు. వామపక్షనాయకులు, విశ్లేషకులు సైతం ఈటెల ఎంచుకునే మార్గం పట్ల అనేక సూచనలు చేశారు. కానీ ఈటెల రాజేందర్ కు ఇవేమీ పట్టలేదు. తన మార్గం తను ఎంచుకోని ముందుకు సాగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో "ఈటెల" కథలో పావులుగా ఉపయోగపడిందెవరు..? పరాజితులవుతున్నది ఎవరు? అనే ప్రశ్నను బహుజన సమాజం వేసుకోవాల్సిన అవసరం ఉంది. కథ పరిణామాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎవరెన్ని చెప్పినప్పటికీ  ఈటెల బుర్రలో ఉన్న అసలు తత్వం అమలు జరుగుతుందనేది అర్థం చేసుకోవాలి. చరిత్ర అందించిన అవకాశాన్ని చేజార్చుకునే విధంగా తన అడుగులు పడుతున్నాయనేది ఇప్పటికే తేలిపోయింది. పరిక్షా సమయంలో "ఈటెల"  ఆత్మగౌరవం వైపా..? ఆత్మవంచన వైపా...? అనేది తేలిపోతోంది. ఆత్మగౌరవాన్ని పక్కనపెట్టి   ఆస్తుల రక్షణకు ఆత్మవంచనకు సైతం వెనుకాడబోడని ఈటెల కథ శుభం కార్డు వేస్తోంది. ఈ రాజకీయ చదరంగంలో ఈటెల పోషించిన పాత్ర చరిత్రలో ఎవరిని పరాజితులను చేస్తుందో భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది. 


*****



Comments