Search This Blog
Nava Tarangalu (translated as “New Waves”) is a widely circulated Telugu-language daily newspaper published in the Indian state of Telangana District Warangal, Hanamkonda Owned by BANOTH VIJAYKUMAR. Launched on 2021, the publication serves as a voice for regional and public issues.
త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు
- Get link
- X
- Other Apps
బీసీలు అగ్రవర్ణాల పార్టీలతో కలిసి పనిచేసినంత కాలం శూద్రులకు రాజ్యధికారం దక్కదు...!
బీసీలు అగ్రవర్ణాల పార్టీలతో కలిసి పనిచేసినంత కాలం శూద్రులకు రాజ్యధికారం దక్కదు...!
దేశంలో మెజార్టీ జనాభా కలిగిన బీసీలు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా అధికారం వైపు అడుగులేయక పోవడం బాధాకరం...!
ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే రానున్న తరం మిమ్మల్ని క్షేమిస్తుంది....!
లేకపోతే అందకారం కల్గిన బానిసత్వం అనుభవించాల్సిందే.....! దేశంలో ఎక్కువగా అన్యాయానికిగురౌతున్నా బీసీ సమాజం కనీసం హక్కుల సాధన కోసం పోరాటం చేసి సాదించుకోవడంలో కూడా వెనుకబడిపోయారు....! బిసిల్లారా.....!
మన పయనం ఎటు...?
రాయితీల వైపా....?రాజ్యధికారం వైపా....?
ఇన్ని సంవత్సరాలుగాఎస్సీ,ఎస్టీ, జనాభాను లెక్కిస్తున్నా ప్రభుత్వాలు బీసీల జనాభా లెక్కలను ఎందుకు జరపడం లేదో....? ఈదేశంలో అంబెడ్కర్ వారసులమని చెప్పుకునే వారు కొందరు ఉన్న రిజర్వేషన్లు పంచాలని కొందరు,రిజర్వేషన్లు పెంచాలని మరికొందరు ఆందోళనలు గత కొన్నేళ్లుగా చేస్తున్నారు...!
కానీ...
దేశాన్ని పాలించండం కోసం కృషి చేయకుండా అగ్రవర్ణాల పంచన చేరి దళారులుగా మారుతున్నారు..!
రాజ్యాధికారం కోసం కాకుండా వ్యక్తిగత అభివృద్ధి, పేరు ప్రఖ్యాతీ కోసం బహుజన వాదం ముసుగులో అగ్రవర్ణాలతో అంటకాగుతున్న బీసీ, నేతలను వారుచేస్తున్న దందాను నిలదీయండి..! చదువుకున్న బహుజనులతో నాడు అంబెడ్కర్, కాన్షిరాంలు విసిగిపోయారు...! అక్షర జ్ఞానం ఉన్న బీసీ మేధావులు వంచించడం వల్లనే ఈ దేశంలో రాజ్యధికారం సాధ్యం కావడం లేదు...!
అందుకే చదువులేని బీసీ బహుజన సమాజం వద్దకే కాన్షిరాం వెళ్లి రాజ్యధికారం సాధించాడు....!
అంబెడ్కర్ సమాజానికి బ్రహ్మాండమైన అక్షర ఆయుధాలను అందిస్తే వాటిని సమర్థవంతంగా ఉపయోచుకోవడంలో బీసీ జ్ఞానులు ఓడిపోయి బ్రాహ్మణ సమాజం ముందు బానిసలుగా నిలబడ్డారు..!
మన చదువుకున్న బహుజనుల్లో ప్రధానంగా ప్రతి బీసీలో ఒక్కడు అనుచరులు లేని నాయకుడే...!
బీసీల్లో 10% మంది కలిసి వచ్చినా 73 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఈ పాటికి బహుజన సమాజం బలమైన శక్తిగా మారేది..! భారతదేశానికి ఉన్న సమస్య ఏమిటి...?
భారతదేశానికున్నా సమస్య బీసీల సమస్యే...!
ఎలా...?
ఎస్సీ,ఎస్టీ,లకు రాజకీయ రిజర్వేషన్లు15శాతం ఉంది దాన్ని ఈ దేశంలో ఎవ్వరు కదపలేరు....!
మరి బీసీల సంగతి ఏమిటి...?
బీసీల ఎజెండాను అగ్రవర్ణ కులాలు ఐజాక్ చేసి లక్ష్యాన్ని దారి తప్పిస్తే 70 సంవత్సరాల నుండి బానిసత్వం అనుభవిస్తున్నారు...! కానీ విముక్తి కోసం అంబెడ్కర్ ఇచ్చిన ఓటు హక్కువిలువను వృదాచేస్తున్నారు...!
1,బుర్రఉంది- ఆలోచనలేదు,
2,నోరుంది-ప్రశ్నించడం చేతకాదు,
3,కండున్నాయి-నిజాన్నిచూడలేరు,
కాబట్టి....?
బానిసలుగా జీవిస్తున్నారు...!
కాన్షిరాం ఈదేశ సమస్యను గుర్తిస్తే పరిష్కారం దొరుకుందన్నారు...!
ఏమిటి సమస్య...?
భారతదేశాన్ని బీసీలు పరిపాలించకపోవడమే వల్లనే...!
ఈదేశంలో ఇన్ని సమస్యలు...?
ప్రస్తుతం నడుస్తున్నా....!
రైతుసమస్య,
కులసమస్య,
నిరుద్యోగసమస్య,
పేదరికం సమస్య,
మతసమస్య,
రాజ్యాధికారం లేకపోవడం,
అవినీతి సమస్య,
వరకట్న సమస్య,.....!!!!!
ఇంకా ఎన్నో సమస్యలు బీసీలు రాజ్యాధికారం చేపట్టకపోవడం వల్ల ఇన్ని సమస్యల్లి ఈదేశ పౌరులు అనుభవిస్తున్నారు....! నిజమైన శేత్రువును గుర్తిచకుండా వారు పన్నిన ఉచ్చులో పడి బానిసలుగా జీవిస్తున్నారు. మత రాజకీయాల లక్ష్యం ఏంటో తెలుసా?
బి.సీ లను ఉద్యమాల వైపు నడవకుండా భక్తి వైపు నడిపించాలని, సంఘటితం కాకుండా బతుకుదెరువు వైపు నడిపించాలి
మండల్ నివేదిక బొందపెట్టాలి,కమండలం చేతిలో పెట్టి, బడి గంట బందుపెట్టి గుడి గంటలు మోగించండి.
ఇప్పుడు మనం
బీసి లను కూడా మేల్కొలిపి భక్తి నుండి సత్యం వైపు నడిపించాలి. అంబేడ్కర్ పూలె పెరియార్ దారిలో నడిపించాలి. అయోధ్య రామ మందిరం 1500 కోట్లతో యాదాద్రి 1500 కోట్లతో తెలంగాణలో కడుతున్నారు, వీటిని ఎవరు కట్టమన్నారు చదువు ను మొత్తం ప్రైవేట్ పరం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి, బహుజనులకు ఉపయోగపడే వి మాత్రం ప్రైవేట్ పరం,కానీ ఈ దేవాలయాల్లో ఏ ఒక్క bc, sc, st ల లో ఎవరి నైనా పూజారిని చేయగలరా, ఈ దేశంలో బహుజనులు విద్యా వాంతులు అయితే మాపై తిరగబడతారు అని మతం ముసుగులో బహుజనులు ఏకం కాకుండా రాజ్యాధికారానికి, చదువుకు దూరం చేసే కుట్రలు జరుగుచున్నాయి ఇకనైనా బహుజనులు మేల్కోవాలి. బీసీ మిత్రులారా..! ఒక్కసారి ఆలోచించండి...?
తెలంగాణ రాష్ట్రంలో బీసీల శాతం 56% మని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ చెపుతుంది...! తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తరహా61% తరహా రిజర్వేషన్లు ఇవ్వచ్చుఅనికేసీఆర్ ప్రకటించారు ..!
కానీ ఏమైందో తెలియదు కాని 34% ఉన్నా రిజర్వేషన్లు ఉద్యమ రాష్ట్రంలో22% పడిపోయాయి...!
34శాతం ఉన్న రిజర్వేషన్లు22% తగ్గడం వల్ల బీసీ సమాజం ఎంతగా నష్టపోతున్నారో అర్థం కావడం లేదా...? ఇంకా ఉద్యమ పార్టీ అని దాని తోక పట్టుకొని తిరుగుతున్నారు...!
మిమ్మల్లి బీసీ సమాజం ఎందుకు నమ్మాలి...?
బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని సుప్రీంకోర్టు లో పిటిషన్ వేసి, బీసీల పట్ల ప్రేమ ఉన్నట్లు నటించిన రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టు లో వేసిన పిటిషన్ విరమించుకొన్నారో బీసీ సమాజానికి తెలుపాలి...!
బీసీలను రాజకీయంగా దెబ్బతీయలన్నా కేసీఆర్ ఎత్తుగడను విజ్ఞులైన బీసీ మేధావులు ఎందుకు ప్రశ్నించడం లేదు...?
ఇంకా ఎన్నాళ్ళు మౌనంగా ఉంటారో చెప్పండి..?
తెలంగాణ హైకోర్టు బీసీల జనాభను లెక్కచేయాలి.
- Get link
- X
- Other Apps
Comments
Popular Posts
పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచితే సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏమిటి
- Get link
- X
- Other Apps

ఈ చర్చ ఎవరి కోసం ..? చర్చకు పెట్టిన అంశాలలో క్లారిటీ లేదనేదే నా అభిప్రాయం. అంబేద్కర్, కాన్షీరాం లు బీసీల కోసమే తపించినట్లుగా ఉంది మీ విశ్లేషణ. బీసీ సమాజం రాజ్యాధికారం లేక తీవ్రమైనఅన్యాయానికి గురవుతుందని ఆవేదన చెందుతున్న మీరు బీసీల కంటే అట్టడుగున ఉన్న కులాలలోని మనుషుల గురించి తపిస్తే బాగుంటుంది. ఆలోచిస్తారని ఆశీస్తున్న. అసలు మీరు బీసీ వాదాన్ని ఎందుకోసం నెత్తిన ఎత్తుకున్నారో వివరిస్తే వినాలని ఉంది. బీసీలకు రాజ్యాధికారం లేకపోవడం వల్లనే ఈ అసమానతలు ఉన్నట్లుగా సాగుతున్న మీ విశ్లేషణలు ఉన్నాయి. రాజ్యాధికారం వస్తే కుల సమస్య పోతుందని బావిస్తున్నారా...? అసమానతలు పోతాయని అనుకుంటున్నారా...? కనీసం బీసీలలోని మనుషుల బతుకులు మారుతాయని అనుకుంటున్నారా...? అంబేద్కర్, పూలే, పెరియార్, కాన్షీరాం లు బీసీల కొరకే తపించినట్లుగా బీసీ సమాజాన్ని సెంటర్ పాయింట్ గా చేసి మీరు చేసే చర్చ బీసీ సమాజాన్ని నెత్తిన ఎత్తుకున్నట్లుగా అనిపించడం లేదా..? బీసీ వర్గాల ప్రయోజనాలే అన్ని వర్గాల ప్రయోజనాలుగా మీరు చిత్రిస్తుండటం సరైంది కాదు. బీసీల కోసం మీరు అంతగా బాధపడటంలో అంతర్యం ఏమిటనే ప్రశ్న, సందేహం కలుగక మానదు. ఎవరి పక్షం వహించాలో వారి పక్షం కాకుండా కొంత మెరుగైనా వర్గాల జాబీతాలో అస్తిత్వం కోరుకుంటున్నట్లుగా మీ లాంటి మేధావుల చర్చలు సాగడం, చర్చలు చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం...?
ReplyDeleteఅబ్బాయి చేసింది సమర్ధనీయం ఇలాంటి తల్లులకు గొడ్డలి వేటు అనే గొప్ప సమాధానం
Delete