Search This Blog
Nava Tarangalu (translated as “New Waves”) is a widely circulated Telugu-language daily newspaper published in the Indian state of Telangana District Warangal, Hanamkonda Owned by BANOTH VIJAYKUMAR. Launched on 2021, the publication serves as a voice for regional and public issues.
త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు
- Get link
- X
- Other Apps
ధర్మంగా ఎన్నికల్లో గెలవాలంటే మెజార్టీ రావాలి...! కానీ ఎన్నికల్లో గెలుపొందిన వారికి 100% ఓట్లు వస్తున్నాయా...?
ధర్మంగా ఎన్నికల్లో గెలవాలంటే మెజార్టీ రావాలి...! కానీ ఎన్నికల్లో గెలుపొందిన వారికి 100% ఓట్లు వస్తున్నాయా...?
పోలైన మొత్తం ఓట్లల్లో 51% వచ్చిన వారు గెలిస్తే 49% ఓట్లేసిన వారి అభిప్రాయానికి విలువలేదన్నట్లా...? ఇదెలా న్యాయం..?
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఎస్సీ,ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు కాంగ్రెస్, బిజెపి, టీడీపీ, టిఆర్ఎస్, కమ్యూనిస్టు, ఇంకా ఎన్నో పార్టీలకు ఓట్లు వేశారు...!
మరి ఎస్సీ, ఎస్టీ బీసీ ల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా...?
తెలంగాణ లోని గ్రామాల్లో సర్పంచ్ లైన కొంత మందిని చూస్తే ఎస్టిమేట్ అంటే ఏంటో తెలుసుకోవడానికే ఐదు సంవత్సరాలు గడిచి పోతుంది,
ఇక మహిళ సర్పంచులు ఐతే ఇంకా మరి ఘోరం...!
ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులకు, సర్పంచ్ లకు డబ్బులుంటేనే విలువ అదికూడా తెలివి ఉంటేనే....!
ఇక చట్టం అధికారం అనే పదాలు అంటే ఏమిటో నిజంగా తెలియవు...! తెలిసినా చట్టాన్ని కాపాడుతున్న రెవెన్యూ, పోలీసు, గ్రామీణాభివృద్ధి, ఇంకా తదితర శాఖల అధికారులు సర్పంచ్ లకు పూర్తిగా సహకరించక పోవడం వల్ల ప్రజలకు సేవ చేయలేక, ఆర్థికంగా నష్టాలపాలై రాజకీయాలంటేనే విసుగు వచ్చి రాజకీయ బానిసలుగా మారిపోతున్నారు...!
అంతే కాకుండా రోజు ఎమ్మెల్యే వస్తున్నాడంటే ఏర్పాట్లు చేయడం, లోకల్ నేతలు ఏ పనిచెప్పిన చేస్తూ ఉన్నతమైన చదువులు చదివిన నేతలు, గ్రామాల్లో పంచాయితీలు చేస్తూ అధికారులకు నాయకులకు మధ్య వర్తులుగా పనిచేస్తూ కుటుంబాన్ని, పిల్లలను పట్టించుకోకుండా మద్యానికి అలవాటుపడి కుటుంబాన్ని బజారు పాలుచేస్తున్నారు....!
చిన్నప్పటి నుండి నేర్చుకున్నా క్రమశిక్షణ రాజకీయ పార్టీల నేతల తీరుతో ఆత్మగౌరవం దెబ్బతిని జీవితంలో ముందుకు పోలేక, వెనుక కు రాలేక అంతర్మధనంతో నలిగిపోయి ఆత్మహత్యలు చేసుకొన్న సంఘటనలు కోకొల్లలు...!
ప్రతి సంవత్సరం తెలంగాణ నుండి ఇంజినీరింగ్ చేసి సుమారు 50,000 వేల మంది పట్టా పట్టుకొని బయటకు వస్తే ఉద్యోగాలు లేవు..!
ప్రైవేటు ఉద్యోగం కోసం వెళితే కులం అడిగి లేదంటున్నారు...! చదివిన చదువుకు తగ్గ ఉపాది లేని పరిస్థితిని ప్రభుత్వాలు కల్పించడం వల్ల ఎంతో భవిష్యత్ కలిగిన యువతరం అనేక ఇబ్బందులు పడుతున్నారు.....!
ఉద్యమం చేసి తెచ్చుకున్నా తెలంగాణ లో విద్యార్థిని, విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్స్ ఇప్పుడు, అప్పుడు అని కొంచింగ్ సెంటర్స్ లో ఫీజులు కట్టి ప్రిపరేషన్ ఐతే చివరికి నోటిఫికేషన్లు లేక వయస్సు పెరిగి ఉద్యోగానికి అర్హత కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు...!
స్వయం ఉపాధి చేసుకొని జీవిద్దామన్నా బ్యాంకులు రుణాలు ఇవ్వక అవస్థలు పెడుతున్న సంగతి తెలియని విషయం కాదు....!
ఒక వేళ ఇద్దామని బ్యాంక్ వారు భవించినా వారు అడిగే కోలాస్ట్రల్ సెక్యూరిటీ ఇవ్వలేక మధ్యలో ఆగిపోతున్నా పరిస్థితి...!
మరి ఎస్సీ, ఎస్టీ, వారి పరిస్థితి ఏమిటి....?
తెలంగాణ వస్తే ఎస్సీ లకు 3 ఎకరాల భూమి అన్నారు అది కూడా ఇవ్వలేదు...!
మొదటి బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఎస్సీ లకు ఇవ్వకుండా మిషన్ భగీరథ పథకానికి మళ్లించిన కేసీఆర్ ను ఎవ్వరాడగాలి...?
టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న కడియం, తాటికొండ రాజయ్య, కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్, అరూరి రమేష్, ఇంకా ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్క మాట మాట్లాడరు....!
ఇక బాల్క సుమన్ ఐతే నేను కేసీఆర్ కు, కెటిఆర్ కు ప్రత్యేకంగా టీ ఆర్ ఎస్ పార్టీకి నేను కట్టు బానిసను అని హుజురాబాద్ సభలో ప్రకటించారు...!
ఇది మన ఉద్యమ తెలంగాణ ఎస్సీ వీరుల సంగతి...! మరెట్లా...?
తెలంగాణ లో దళితుల పై దాడులు, హత్యలు, హత్యాచారాలు, కులం పేర అవమానాలు ఎన్నో ఎన్నో సంఘటనలు జరిగినప్పుడు కూడా వీరు ఒక్క మాట కూడా మాట్లాడని పరిస్థితి....!
చిన్న రాష్ట్రాలు ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చని అంబెడ్కర్ ఆర్టికల్ 3 ద్వారా అవకాశాన్ని కలిపిస్తే ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన తెలంగాణ లో ఎస్సీ, ఎస్టీ బీసీ ప్రతినిధుల కు మాట్లాడే హక్కుగాని, ప్రశ్నలు అడిగే హక్కుగాని లేదంటే అగ్రవర్ణాలు బహుజన సమాజాన్ని ఎంత అదుపులో పెట్టుకొని అధికారం చేలాయించుచున్నారో అర్థం చేసుకోవచ్చు ...!
ఒక వైపు కేంద్ర ప్రభుత్వం మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బీసీ ల కోసం అనేక నిధులను బడ్జెట్లో పెట్టి ఊరించి బహుజన సమాజం నోట్లో మట్టి కొట్టుతున్నా సంగతి బానిస సమాజం ఎప్పుడు తెలుసుకుంటుందో....మరి...?
జైభీంలతో,
బండిమొగిలి,
న్యాయవాది,
9989602566.
- Get link
- X
- Other Apps
Comments
Popular Posts
పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచితే సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏమిటి
- Get link
- X
- Other Apps



Thanks for good information
ReplyDelete