Search This Blog
Nava Tarangalu (translated as “New Waves”) is a widely circulated Telugu-language daily newspaper published in the Indian state of Telangana District Warangal, Hanamkonda Owned by BANOTH VIJAYKUMAR. Launched on 2021, the publication serves as a voice for regional and public issues.
త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు
- Get link
- X
- Other Apps
ప్రపంచానికి అన్నం పెట్టే రైతు పోరాటం....!
ప్రపంచానికి అన్నం పెట్టే రైతు పోరాటం....!
అర్ధసంవత్సర మైన పరిష్కారం కాలేదంటే....!
పాలిస్తున్నది ప్రజాస్వామ్య పాలకులేనా...?
******************************
పాలకులకు రైతు సమస్యల కన్నా కార్పొరేట్ రంగ వ్యాపారస్తుల ప్రయోజనాలే ముఖ్యమన్నా భావన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదిగా మనకు కనబడుతుంది...!
ఎక్కడో పుట్టిన కరోనా వైరస్ ను ఈ దేశానికి తెచ్చినా కార్పొరేటు సంస్థలు ఆ మహమ్మరి బారిన పడి మరణిస్తున్నా... కుటుంబాల కోసం గాని ప్రభుత్వానికి గాని ఏమాత్రం సహకారం అందించండం లేదు...!
ప్రపంచ కుబేరుల జాబితాలో సుమారు 130 మంది భారతీయ వ్యాపారస్థులున్నప్పటికి, వారికి దేశలోని పేద ప్రజలకు సహాయం చేయడానికి చెయ్యి రాదు....!
కానీ దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలకు ఎన్నికల ఖర్చుల కోసం కోట్లాది రూపాయలు ఎన్నికల పండ్ ఇచ్చి వారికి కావలసిన అవసరాలు తీర్చుకోవడం కోసం కార్పొరేట్ సంస్థలు నిరంతరం ప్రణాళికలు రచిస్తూ ఎంతో భవిష్యత్తు గల దేశాన్ని, దేశ ఔన్నత్యాన్ని నాశనం చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవు...!
130 కోట్ల జనాభా కలిగిన భారత దేశంలో ఇప్పటివరకు 19 కోట్ల మందికి అన్ని రకాల వ్యాక్సిన్లు( కోవిషెల్డ్,కోవాక్సిన్, స్పుత్నిక్, తదితర) సింగిల్ వేసి చేతులు ముడుచుకొని కూర్చుని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఈ కేంద్ర ప్రభుత్వం ఉంది....!
ప్రపంచంలోని అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే మొదటి డోసు,రెండవ,డోసు వాక్సిన్ ఇచ్చి ఆయా దేశాల్లో కరోనా మహమ్మారి ఉధృతిని ఆపగలిగారు....!
అమెరికా అయితే 33 కోట్ల జనాభాకు ఇప్పటికె రెండు డోసుల వాక్సిన్ ఇచ్చి ఇంకా వారి దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం సుమారు 150 కోట్ల వ్యాక్సిన్ల నిల్వలను ఉంచుకొన్నట్లు తెలుస్తుంది....!
రైతు ప్రయోజనాలను దెబ్బతీసే 3 వ్యవసాయ వ్యతిరేక బిల్లులను రద్దుచేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రైతులు పోరాటం చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదు.....!
పైగా పండిన పంటకు గిట్టుబాటు ధర లేక విలవిలలాడి సగటున ఈ దేశంలో 13 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఆ దేశ గణాంకాలు చెపుతున్నాయి...!
కానీ రెక్కడితే గాని డొక్కాడని రైతన్నా ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వాలు అందుకు విరుద్ధంగా ఉండటం సబబు కాదు....!
ఇప్పటికీ భారతదేశంలో సుమారు 87కోట్ల మంది చిన్నకారు, సన్నకారు రైతులు వ్యవసాయం చేసి ఈ దేశంలోని ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నారు...!
అలాంటి రైతుల ప్రయోజనాలను కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధంగా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావడాన్ని నిరసిస్తూ ఆరు నెలలుగా సుమారు దేశంలోని 40 రైతు సంఘాల నేతృత్వంలో రైతులు రోడ్లపై ఆందోళనలు చేస్తున్నా మోడీ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రనుండి లేవడం లేదు...!
పాలకులు,రైతు ప్రతిబందక నిర్ణయాల వల్ల వ్యవసాయ సంక్షోభం, వాటిల్లి అప్పుల ఊబిలో ఆకలి,ఆక్రన్దనల్లో రైతాంగం కొట్టుమిట్టాడుతోంది....!
ఒకవైపు రైతు వ్యతిరేక చట్టాలు, మరోవైపు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించని ప్రభుత్వలకు రానున్న రోజుల్లో ప్రతిఘాతుక ఉద్యమాలు వచ్చే పరిస్థితి దగ్గర లొనే ఉంది....!
జైబీమ్ లతో,
బండిమొగిలి,
న్యాయవాది,
9989602566.
- Get link
- X
- Other Apps
Popular Posts
పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచితే సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏమిటి
- Get link
- X
- Other Apps

Comments
Post a Comment