Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

తల్లి లైంగిక సంబంధం....! కొడుకును నేరస్థున్ని చేసింది....! (ఖమ్మం జిల్లాలో జరిగిన యాదార్ధ సంఘటన)








నైతిక విలువలు లేని జీవితం భయంకరమైన ఫలితాలకు కారణమవుతుంది. అందుకే బుద్ధుని పంచశీల అవసరం. మనిషి శరీరం, మనసు రెండు అనైతిక పనులు చేయమని తొందర పెడుతాయి. మోహం, కామం శరీర, మానసిక రసాయనిక చర్యల ఫలితం. అవి చాలా సంతోషాన్ని ఇస్తాయి కావొచ్చు గానీ మనుషి ప్రాణాలు కోల్పోవడానికి దారితీస్తుంది. అంతులేని విషాదానికి కారణమవుతుంది.


 ఖమ్మం జిల్లా లో జరిగిన ఒక ఉదంతం నా దృష్టికి వచ్చింది.

   తల్లి అనైతిక లైంగిక సంబంధం ఒక మైనర్ కొడుకును నేరస్తుణ్ణి చేసింది. ఇక చదవండి.

******************************

             నిత్యం ఆందోళన తలలో.... 

ఎప్పుడు ఈ సమస్యకు పరిష్కారం...?

   కని పెంచిన తండ్రి అవమాన భారం భరించలేక ఆత్మహత్య చేసుకొని కాలం చేసి సంవత్సరం కూడా కాలేదు....

   అయిన అమ్మ ప్రవర్తనలో మార్పు రాలేదు..... 

శరీరసుఖం కోసం కన్నవారిని, కట్టుకున్న వాడిని మోసం చేసి జీవించడానికి అలవాటు పడ్డ అమ్మ, వల్ల రెండు కుటుంబాలే కాక, రెండు గ్రామాల ప్రజలు, బంధువులు, మిత్రులు అంతా వింతగా మాట్లాడుకోవడాన్నీ ఇంకా ఎన్నాళ్లు భరించాలి...?

   ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి...?

   ప్రతిరోజు వేధించే ప్రశ్న లు...? 

నిత్యం తనువంత  ప్రశ్నలతో నిండి పోయి శాశ్వత పరిష్కారం లభించక గత కొన్ని సంవత్సరాల నుండి సతమతమవుతున్న తనకు, తన భవిష్యత్తుపై ఆశలు ఆవిరై పోతున్నా తెలియని స్థితి....!

   మనస్సును ఎంత నిబ్బరం చేసుకున్నా క్షణం, క్షణం, ఏదో తెలియని అలజడి...! 

ఆందోళన వల్ల ఒంటరితనానికి అలవాటు పడ్డ తాను ఎక్కడికి వెళ్ళినా ఒంటరితనమే స్నేహంగా వచ్చింది...!

  గ్రామంలోని ప్రతి చావండి  తన తల్లి గురించి ప్రస్తావిస్తూ హేళనగా మాట్లాడుతూ దగ్గరికి వెళ్లడంతో అమ్మపై చర్చలు ఆపి  అయ్యో పాపం గింతెత్తు కొడుకు ఉన్నప్పటికీ ఆముండకు గిదేమి పని, మోగాన్నిసంపుకొని  కూడా నేను పత్తిత్తునని, రంగు రంగుల బట్టలు వేసుకుని పడుసు పోరాగానితో కులకడానికి దానికి సిగ్గు ఎగ్గు లేదు...!

    అమ్మ గురించి గుసగుసలు బహిరంగంగానే వినపడుతున్న ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి...!

    అమ్మ గురించి మేనమామలు, అత్తమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు ఎంత చెప్పినా అప్పటికి విన్నట్టు విని  వాడు కనపడగానే శరీరచాయల్లో తిమ్మిర్లు గమ్మే వ్యామోహం  ఎప్పుడు అగుతుంది..!

    అసలు ఆగుద్దా...?

    ఇలాంటి అనుమానాలు, అనేక రకా రకాలుగా తనకు తానుగానే చర్చ చేసుకొని అవమానకర దృశ్యాలు చూసిన తన కళ్ళు ఒక్క క్షణం కూడా రెప్ప వాల్చడం  లేదంటే తన తల్లి నీచమైన ప్రవర్తన ఏ స్థాయిలో ఉందో  అర్థం చేసుకునే వయస్సు కూడా లేదు తనకి...!

   ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఎప్పటినుంచో జరుగుతున్న ఈ రంకు తంతుకు ముగింపు లేదనుకున్నాడు...!

 ఇగ అమ్మ మారదని గమనించిన బంధువులు అమ్మను అనుభవిస్తున్నా ఉపేందర్  ఇంటికి వెళ్లి గొడవ పెట్టి వాళ్ల తలిదండ్రులను కలిసి జరుగుతున్న అరాచకాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినా సందర్భం,.... 

ఆ యువకున్ని మరింత కృంగదీసింది...!

  నా కొడుకు పవిత్రుడు అభం శుభం తెలియని నా కొడుకును బుట్టలో వేసుకొని వాని జీవితాన్ని నాశనం చేస్తున్నా... 

మీ అవ్వకు బుద్ధి చెప్పకుండా మా ఇంటికి వచ్చి అల్లరి చేస్తే లాభం లేదని అసలు నీ అయ్యా మొగోడైతే నీ అమ్మ నా కొడుకు దగ్గరికి ఎందుకు వస్తుందని....! 

అసలు నువ్వు ఎవడికి పుట్టావో నీది  నీ అవ్వదీ లంజా బ్రతుకు ఇలా పలు విధాలుగా తప్పు చేసిన అబ్బాయి తల్లిదండ్రులు అన్న మాటలకు ఈ భూమిపై ఉండటం వృధా అనుకొని నన్ను కన్న తండ్రి పురుగుల మందు తాగి తనువు చాలించాడు...!

   ఈ విషయం తెలిసిన గ్రామస్తులు కుటుంబ సభ్యులు అంతా కలిసి  నా తండ్రి మరణానికి కొడిమెల ఉపేందర్ కారణమని, ఉపేందర్ కున్న అర ఎకరం  భూమి అమ్మి నష్టపరిహారం చెల్లించారు కాగా వచ్చిన డబ్బును కూడా వాడు నన్ను వాడుకున్నాడు కాబట్టి ఆ డబ్బు నాకే వర్తిస్తుంది అనే వాదన ఆ పసి హృదయాన్ని ఇంకా ఘోరంగా కృంగదీసింది...!

    కట్టుకున్న భర్త అవమానం భరించలేక మరణించినా నా తల్లి హృదయం లో క్షోభలేదు, బాదలేదు...! పర్చతాపం అంతకన్నా లేదు...!

   ఇంట్లో వారు ఎవరు ఎదురు చెప్పిన ఎదురు దాడి చేయడం అనేది యాదృచ్ఛికం ఐయ్యింది...!

     ఒకవైపు కుటుంబం మరొకవైపు సమాజం ఎటు చూసినా ఒంటరిగా మిగిలిన తనకు ఈ సమస్యకు ముగింపు ఇవ్వాలని స్థిరంగా  నిర్ణయించుకొని ఒక్కసారి ఎన్నో ఏళ్లుగా తన శరీరానికి దూరంగా ప్రవహిస్తున్న ప్రశాంతతను శరీరం నిండా నింపుకొని సేదదీరి ఆలోచనలో పడ్డాడు...!

     ఇలా అదును కోసం చూసి చూసి అనేకసార్లు తనకు తాను సర్ది  చెప్పుకున్నాడు...!

   నా తల్లి తప్పు చేయడం వల్ల మా నాన్న ఆత్మహత్య చేసుకొని నా ఆలనా పాలన చూడకుండా తనువు చాలించాడు...!

    పరిస్థితులను అర్థం చేసుకొక నన్ను కన్న తల్లి కామంతో కళ్లు మూసుకుపోయి నాకు జన్మనిచ్చిన కుటుంబాన్ని అవమానానికి, నా భవిష్యత్ కి చిరునామాగా మార్చి సమాజంలో తలెత్తుకోకుండా చేసింది...!

   ఇంక నాకు భవిష్యత్తు ఉందా...?

 లేదా...?

    ఇలాంటి అనేక ప్రశ్నలు వేసుకొని వేసుకుని వేదన ఆవేదన ఆక్రందనకు గురైన ఆ పసి హృదయం మళ్లీ వేడెక్కింది...!

   ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం తప్పకుండా వెతకాలని తను చేయని ప్రయత్నం అంటూ లేదు..!

  ఎందుకైనా మంచిదని ఉపేందర్ తో ఒకసారి మాట్లాడి మా అమ్మను వదిలిపెట్టమని అడిగి, ప్రాధేయపడాలని  నిశ్చయించుకొని ఒక ప్రయత్నం చేశాడు. కానీ ఉపేందర్ అలాంటి అవకాశం ఇవ్వలేదు. మీ అమ్మకు నాకు ఏమి సంబంధం లేదు నీకు చేతనైంది చేసుకో...!

    నేను మీ అమ్మ దగ్గరికి వస్తున్నానా..! లేదా మీ అమ్మే నా దగ్గరికి వస్తుందా..! 

నీకు తల పని చేయడం లేదని ఐనా పెద్ద విషయాలు నీకెందుకురా..?

 నువ్వు మంచిగా చదువుకో...! అని, నేను మీ అమ్మకు దూరమైతే ఎట్లా


...?

 అయిన ఒకసారి మీ అమ్మని అడిగి నా దగ్గరికి రాకుండా చూసుకోమని ఉచిత సలహా ఇచ్చాడు ఉపేందర్...!

 

    గత కొన్ని సంవత్సరాల నుండి తల్లిని ఏమని   ప్రశ్నించాలి...?

  ఈ సమస్యను ఎలా అధిగమించాలని  చివరికి ఒక అభిప్రాయానికి వచ్చి ఉపేందర్ ను చంపివేస్తే మా అమ్మా నాకుంటుందని గట్టిగా నిర్ణయించుకుని అవకాశం కోసం కాచుకుని కూర్చున్న తనకు రాత్రి ఇంటి దాబా పైన అమ్మ పక్కలో పడుకుని సేదతీరుతున్న ఉపేందర్ ను గొడ్డలితో కసితీరా నరికి చంపి ఉత్సాహం చేసుకున్నాడు....!

( ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం తూటికుంట్ల గ్రామంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఇది)

           సేకరణ ; బండి మొగిలి,

                    న్యాయవాది,

                    9989602566.

Comments

  1. REALLY Good message for all

    ReplyDelete
  2. ఆకలి రుచి ఎరుగదు,నిద్ర చోటే రుగదు,కామానికి సిగ్గు,లజ్జ లేవు అంటారు అనుభవజ్ఞులు.ఆకలి తీరని వాడు దొంగ తనం చేస్తాడు.నిద్ర ముంచు కొచ్చిన వాడు పట్టె మంచం కోసం వెతు కడు.అలాగే కామం తో కళ్ళు మూసుకున్న వాళ్ళు పశువు తో సమానంగా ప్రవర్తిస్తారు.

    ReplyDelete

Post a Comment